దేశంలో యూపీఐ లావాదేవీలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కరోనా పుణ్యాన డిజిటల్ పేమెంట్లు చేసే వారి సంఖ్య మరింత పెరిగిపోయింది. అయితే ఫోన్ పే, గూగుల్ పే, పేటీఆమ్ లనే ఎక్కువగా వాడుతుంటారు చాలా మంది. కానీ సామాజిక మాధ్యమ దిగ్గజం అయిన వాట్సాప్ కూడా వాట్సాప్ పేమెంట్స్ను ప్రారంబించింది. కానీ ఎక్కువగా లావాదేవీలు జరగకపోవడంతో బంపర్ ఆఫర్ ను ఇచ్చింది. కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు క్యాష్ బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది.
వాట్సాప్ ద్వారా వ్యాపార చెల్లింపులను తీసుకు రావడంపై దృష్టి సారించినట్లు వివరించింది. ఇటీవలే వాట్సాప్ పేమెంట్ సర్వీస్ లిమిట్‌ను 100 మిలియన్ యూజర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ). ఇప్పటికే భారత్‌లో 400 మిలియన్లకుపైగా వినియోగదారులు ఉన్న వాట్సాప్‌కు అది పెద్ద సానుకూల అంశం. అలాగే వాట్సాప్‌లో క్యాష్‌బ్యాక్ పొందాలంటే నగదు చెల్లింపులపై ఎలాంటి కనీస పరిమితులు లేవు. ఒక రూపాయి సైతం పంపించొచ్చు. వారు కూడా క్యాష్‌బ్యాక్‌కు అర్హులే. అయితే.. ఈ ఆఫర్ మూడు లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుంది.