Wanted PanduGod Movie Review : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పణలో రూపొందిన వాంటెడ్ పండుగాడ్ (Wanted PanduGod) మూవీ ఎట్టకేలకు ఆగస్టు 19 (శుక్రవారం) థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమాలో సుడిగాలి సుధీర్, యాంకర్ దీపికా పిల్లి, మరో యాంకర్ విష్ణుప్రియ బుల్లితెర స్టార్స్ కలిసి నటించారు. వాంటెడ్ పాండుగాడ్ మూవీలో రాఘవేంద్రరావు మార్క్ పాటలు బాగానే చూపించారు. కామెడీ కూడా అదే తరహాలో నవ్వులు పూయించేలా ఉంది. ఇంతకీ ఈ మూవీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకునేలా ఉందో తెలియాలంటే ఓసారి రివ్యూలోకి వెళ్లాల్సిందే.

ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ పండు (సునీల్).. జైలు నుంచి పారిపోతాడు. ఇంతకీ పండును ఎవరూ పట్టుకుంటారో వారికి రూ. కోటీ రివార్డును పోలీసులు ప్రకటిస్తారు. అది తెలిసిన పాండు (సుధీర్) (దీపికా పిల్లి) రిపోర్టర్లు రంగంలోకి దిగుతారు. పారిపోయిన పండును ఎలాగైనా పట్టుకునేందుకు తెగ ప్రయత్నిస్తుంటారు. చివరికి పండుని ఎవరు పట్టుకున్నారో తెలియాలంటే మిగతా స్టోరీని థియేటర్‌కు వెళ్లి చూడాల్సిందే.
నటీనటులు వీరే (Movie Cast) :
సుడిగా సుధీర్, యాంకర్ అనసూయ, సునీల్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, దీపిక పిల్లి, బ్రహ్మానందం, రఘు బాబు, అనంత్, పుష్పా జగదీష్, నిత్యా శెట్టి, వాసంతి, విష్ణుప్రియ, హేమ, షకలక శంకర్, తనికెళ్ల భరణి, పిరుద్, అమాహ్వి మూవీలో నటించారు. శ్రీధర్ సీపాన దర్శకత్వం వహించాడు. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. మహి రెడ్డి పండుగల అందించారు. మ్యూజిక్ పి.ఆర్ అందించగా.. సాయిబాబా కోవెల ముడి, యునైటెడ్ కె ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కోవెల ముడి నిర్మించారు. ఇక చివరిగా కె. రాఘవేంద్ర సమర్పణలో చిత్రం రావు ఈ మూవీని నిర్మించారు.
Movie Name : | Wanted PanduGod (2022) |
Director : | శ్రీధర్ సీపాన |
Cast : | సుడిగాలి సునీల్, అనసూయ, సప్తగిరి, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, దీపిక పిల్లి, డా. బ్రహ్మానందం, సుడిగాలి సుధీర్, రఘు బాబు, విష్ణుప్రియ, హేమ, షకలక, తనికెళ్ల భరణి |
Producers : | సాయిబాబా కోవెల ముడి, వెంకట్ కోవెల ముడి |
Music : | పి.ఆర్ |
Release Date : | 19 ఆగస్టు 2022 |
Wanted PanduGod Movie Review : ఇంతకీ సినిమా ఎలా ఉందంటే.. వెండితెరపై బుల్లితెర స్కిట్..

వాంటెడ్ పండుగాడ్ మూవీ చూస్తుంటే.. వెండితెరపై బుల్లితెర స్కిట్ చూస్తున్నట్టుగానే అనిపించింది. ఎందుకంటే మూవీలో చాలా చోట్ల నాన్-సింక్ కామెడీ కనిపించింది. కన్ఫ్యూజన్ డ్రామా జబర్దస్త్ వంటి కామెడీ షోలో అద్భుతంగా వర్కౌట్ అవుతాయనే చెప్పాలి. వెండితెరపై పెద్దగా ఆకట్టుకునేలా లేదనే చెప్పాలి. స్టోరీ లైన్ చూస్తుంటే.. వాంటెడ్ పాండుగాడ్ టీవీ స్కిట్‌లకి ఎక్స్టెండెడ్ వెర్షన్ మాదిరిగా అనిపించింది. ఎక్కడ కూడా సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో కనిపించేలా లేదు. టీవీ స్కిట్‌లను ఇష్టపడే వారికి ఈ మూవీ ఫుల్ కామెడీతో ఎంగేజ్ చేస్తుంది. సరదగా నవ్వుకుందామనే వాళ్లకు ఈ మూవీ చూసి కడపుబ్బా నవ్వుకోవచ్చు.
వాంటెడ్ పాండుగాడ్ మూవీ కొన్ని మూవీలకు దగ్గరగా అనిపిస్తుంది. అందులో ఎక్కువగా నాన్-సింక్ కామెడీతోనే సన్నివేశాలు చాలావరకూ సాగదీసినట్టుగా అనిపించింది. సునిల్, సుధీర్, అనసూయ, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, విష్ణు ప్రియ, దీపికా పిళ్లై తమదైన పాత్రలతో సత్తా చాటారు, మిగతా నటీనటుల పర్ఫార్మెన్స్ పర్వాలేదనిపించింది. డైరెక్టర్ శ్రీధర్ సీపాన ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు.
ఈ మూవీలో రాఘవేంద్రరావుకు ఎక్కువగా స్ర్కీన్ స్పేస్ ఇచ్చారు. చాలా సీన్లలో ఆయనే కనిపించారు. టెక్నికల్ గా చెప్పాలంటే.. మహిరెడ్డి విజువల్స్ పర్వాలేదు. మ్యూజిక్ డైరెక్టర్ పి.ఆర్ పాటలు ఆకట్టుకునేలా లేవు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపించింది. మొత్తం మీద వాంటెడ్ పండుగాడ్ మూవీ టీవీ స్కిట్ లవర్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చే రొటీన్ కామెడీ-డ్రామా.. ఫైనల్‌గా చెప్పాలంటే.. పండుగాడ్ మూవీని చిన్నవారి నుంచి పెద్దవారు వరకు అందరూ థియేటర్‌కు వెళ్లి మూవీని చూసి కాసేపు సరదాగా నవ్వుకుని రావొచ్చు.
[ Tufan9 Telugu News ]
మోస్ట్ వాంటెడ్ పండుగాడ్
మూవీ రివ్యూ & రేటింగ్ : 3.50/5
ఇవి కూడా చదవండి.. :
Karthikeya 2 Movie Review : కార్తికేయ 2 మూవీ రివ్యూ.. ఫస్ట్ హాఫ్‌లో ట్విస్ట్.. క్లైమాక్స్ ఫినిషింగ్ టచ్ అదిరింది..!
Tees Maar Khan Movie Review : ‘తీస్ మార్ ఖాన్’ మూవీ రివ్యూ & రేటింగ్… ఆదికి నిజంగా అగ్నిపరీక్షే.. హిట్ పడినట్టేనా?!
Commitment Movie Review : ‘కమిట్‌మెంట్’ మూవీ రివ్యూ.. ఐదుగురు అమ్మాయిల ‘మీటూ’ పోరాటం..!