Virata Parvam : విరాట పర్వం మూవీ రిలీజ్ అయి మంచి హిట్ టాక్ అందుకుంది. సాయి పల్లవి, దగ్గుబాటి రానా జంటగా నటించిన విరాట పర్వం మూవీ భారీ అంచనాలతో విడుదలైంది. అయితే ఈ మూవీ పాజిటివ్ టాక్ తో థియేటర్లలో దూసుకుపోతోంది. నక్సలిజం నేపథ్యంలో వచ్చిన ఈ మూవీని బ్యాన్ చేయాలంటూ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు వచ్చింది. విరాటపర్వం అనే మూవీకి అనుమతులు ఇచ్చిన సెన్సార్ బోర్డు అధికారి శిఫాలి కుమార్‌పై విశ్వహిందూ పరిషత్ విద్యానగర్ జిల్లా కార్యదర్శి కె.అజయ్ రాజ్ సుల్తాన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నిషేధిత సంస్థలు నక్సలిజం, ఉగ్రవాదాన్ని ప్రేరేపించేలా ఉన్న మూవీలకు సెన్సార్ బోర్డు ఎలా అనుమతులు ఇస్తుందని ప్రశ్నించారు. అసలు ఇలాంటి మూవీలకు అనుమతులు ఇస్తారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సినిమా బ్యాన్ చేయాలని కోరుతూ సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు వేశారు. విరాట పర్వం మూవీ శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఉందని ఫిర్యాదులో తెలిపారు. పోలీసులను సైతం పరిచే సన్నివేశాలు మూవీలో ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ మూవీలో చాలావరకు అభ్యంతరమైన సీన్లు ఉన్నాయని, సినిమాను వెంటనే నిలిపివేయాలని ఫిర్యాదులో కోరారు. మరోవైపు.. విరాట పర్వం మూవీ ప్రమోషన్లలో భాగంగా సాయి పల్లవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కశ్మీర్ ఫైల్స్ మూవీపై సాయి పల్లవి చేసిన కామెంట్స్ దుమారాన్ని రేపాయి. సాయిపల్లవిపై కూడా కేసు నమోదైన సంగతి తెలిసిందే.
Read Also : Rashmika mandanna: రష్మిక మందన్నాకు డైరెక్టర్ సుకుమార్ అన్యాయం.. పాపం!