Vidur Niti: విదురుడు గొప్ప సద్గురువు. గొప్ప నిజాయితీ పరుడు. ఆయన నిజమైన సత్యవంతుడు. అన్నికంటే ముఖ్యంగా విదురుడు గొప్ప పండితుడు. ఎన్నో శాస్త్రాలో ఔపోసన పట్టిన వాడు. అతనికి ఉన్న గుణాలను శత్రువులు కూడా మెచ్చుకోకుండా ఉండలేరు. అంతడి సుగుణవంతుడు విదురుడు.
మహాభారతంలో విదురుడి ముఖ్యమైన పాత్ర. పాత్ర నిడివి తక్కువే అయినా.. ఆ పాత్ర చెప్పే నీతి యుక్తులు చాలా గొప్పవి. విదురుడి గురించి, ఆయన సుగుణాల గురించి మహాత్మా విదుర్, మహారాజా ధృతరాష్ట్రుల మధ్య జరిగిన సంభాషణలు వివరిస్తాయి. ఎన్నో శాస్త్రాలు, గ్రంథాలు ఔపోశన పట్టిన విదురుడు.. తన అవసరం ఉన్న ప్రతిసారి నీతి సూత్రాలు బోధిస్తాడు. అలా ఆయన జీవితానికి సంబంధించి ఎన్నో గొప్ప విషయాలు చెప్పాడు. విదుర్ నీతి ప్రకారం.. వ్యక్తి మంచి ప్రవర్తనలు అతడి గురించి వివరంగా చెబుతాయి. అతడి ప్రవర్తనే ఇతరుల నుండి గౌరవ మర్యాదలు పొందేలా చేస్తాయి.
ఒక వ్యక్తి తన ప్రవర్తన ఎప్పుడూ మర్యాద పూర్వకంగా ఉండాలి. మర్యాద ఇవ్వడంతో పాటు మాట మధురంగా ఉండాలి. వినయం ఒలకబోయాలి. అలా ప్రవర్తించే వ్యక్తి శత్రువులను కూడా మిత్రులుగా చేసుకుంటారు. అలాగే జ్ఞానం పెంపొందించుకుంటూ ఉంటాలి. నిత్య విద్యార్థిలా మారాలి. ఎప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. మనలోని జ్ఞానానికి ఎప్పటికైనా గౌరవం దక్కి తీరుతుంది.