Vegetable seller problems: ఇటీవల కాలంలో యూట్యూబ్ లో షాట్ర్ ఫిలిమ్స్ బాగా సందడి చేస్తున్నాయి. వెబ్ సిరీస్, రీల్స్, షార్ట్ ఫిలిమ్స్ ఇలా… ఎవరి టాలెంట్ ని వాళ్లు ఆయా రూపాల్లో చూపిస్తూ తమని తాము ప్రూవ్ చేస్కుంటున్నారు. అతి చాలా మంది ప్రతి షార్ట్ ఫిల్మ్ లో ఏదో ఒక అంశం ఫోకస్ చేసి వాటి విలువ పెంచుతున్నారు. ఎన్నో సమస్యలపై మధ్య తరగతి కుటుంబంపై, రైతులపై, ఉద్యోగుల కష్టాలపై, వృద్ధుల ఆవేదనపై ఇలా వీడియోస్ తీసి ఆకట్టుకుంటున్నారు. అయితే తాజాగా ఓ మహిళా రైతు గల్లీలో కూరగాయలు అమ్మితే… చాలా మంది బేరం ఆడుతారు. అదే సూపర్ మార్కెట్ కు వెళ్తే మాత్రం ఎంత అంటే అంత డబ్బులు పెట్టి వస్తుంటారు. అయితే రైతులే నేరుగా కూరగాయలు అమ్మితే ఎదుర్కునే సమస్యలపై వచ్చే వీడియోను తీశారు.
రైతులు ఎంతో కష్టపడి పండింటిన కూరగాయలను నేరుగా కోసుకొచ్చి.. వీధులు, గల్లీల్లో అమ్మితే బేరాలు అడతారని… అదే నెలల పాటు కుళ్లిపోకుండా కెమికల్స్ చల్లుతూ అమ్మే సూపర్ మార్కెట్లలో మాత్రం కూరగాయలు కొనుక్కొచ్చుకుంటారని… ఈ వీడియో సారాంశం. రైతు బిడ్డను అని చెప్పుకుంటూ.. వాట్సాప్ స్టేటస్ లు పెట్టడం కాదు.. తాను కూడా అలాగే నడుచుకోవాలని, రైతులా పని చేయాలని కూడా ఈ వీడియోలో చెప్తారు. అయితే మీరూ ఓసారి ఈ వీడియోపై లుక్కేయండి.
https://youtu.be/73AQrtbJzAk