Guppedantha Manasu November 19 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో రిషి వసుధార ని ఇంటర్వ్యూలో వేసిన విధంగా ప్రశ్నలు వేస్తూ ఉంటాడు.
ఈరోజు ఎపిసోడ్లో వసుధార జగతి మేడం ఆమె నా గురువు తను నా గైడ్ అంటూ మాట్లాడుతుంది. జగతి మేడంని చూస్తే నాకు ధైర్యం పెరుగుతుంది అని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు జగతి కాలేజీలోకి వస్తూ ఉంటుంది. ఇక దూరం నుంచి వసుధార, రిషి ని చూసిన జగతి సంతోష పడుతూ ఉంటుంది. మరొకవైపు దేవయాని ఫోన్లో మాట్లాడుతూ ఈసారి నేను చెప్పినట్టు జరగాలి మర్చిపోవద్దండి మీరు చేయాల్సింది మీరు చేయండి ఆ తర్వాత నేను చూసుకుంటాను అని అనడంతో వెనకాలే ఉన్న ధరణి ఒక్కసారిగా షాక్ అవుతుంది.

అప్పుడు ధరణి తన మాటలు వినింది అనుకున్న దేవయాని ఏం చేస్తున్నావ్ ఎక్కడికి వెళ్లావు అనడంతో కిచెన్ లో వంట చేసుకుంటున్నాను అత్తయ్య అనగా ఆ మాటలు వినలేదులే అని అనుకుంటుంది దేవయాని. ఆ తర్వాత ఎలా అయినా ఆ విషయం ఎవరికో ఒకరికి చెప్పాలి అని ధరణి అక్కడి నుంచి వెళుతుండగా వెంటనే దేవయాని వెనకాలే ఫాలో అవుతూ వెళ్లి ఎక్కడికి వెళుతున్నావు ధరణి అనడంతో ఏమీ లేదు ఇక్కడికే వెళుతున్నాను అనడంతో మరి ఎందుకు టెన్షన్ గా ఉన్నావు అనగా టెన్షన్ ఏమీ లేదు అత్తయ్య నిన్ను చూసిన ప్రతిసారి నాకు టెన్షన్ గానే ఉంటుంది అంటూ కవర్ చేస్తుంది.
అప్పుడు సరేలే నాకు కొంచెం తలనొప్పిగా ఉంది వచ్చి తల పట్టు అని ధరణి ని అక్కడి నుంచి పిలుచుకుని వెళ్తుంది దేవయాని. మరొకవైపు మహేంద్ర జగతి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండగా అప్పుడు గౌతమ్ అంకుల్ వసుధార బాధని మేడం అర్థం చేసుకున్నారు కాబట్టి వెళ్లారు మీరు కూడా వస్తారు అన్న ఆశతో రిక్వెస్ట్ చేయాలని వచ్చాను అంకుల్ అని అనగా నేను రాను గౌతం అని అంటాడు మహేంద్ర. ఇంతలోనే మహేంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడు ధరణి గౌతమ్ కి ఫోన్ చేస్తుంది. చెప్పండి వదిన అని అనడంతో వెంటనే మహేంద్ర అక్కడికి వస్తాడు.
Guppedantha Manasu నవంబర్ 19 ఎపిసోడ్ : రిషి మాటలకు ఎమోషనల్ జగతి…
అప్పుడు వసుధర విషయంలో దేవయాని అత్తయ్య ఏదో ప్లాన్ వేస్తోంది మీరే కొంచెం జాగ్రత్తగా ఉండండి గౌతమ్ అనటంతో మహేంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మరొకవైపు రిషి పని చేసుకుంటూ ఉండగా వసుధార జగతి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఒక అతను జ్యూస్ తీసుకొని వచ్చి కావాలనే వసుధార డ్రెస్ పై పోస్తాడు. అప్పుడు రిషి సీరియస్ అవుతాడు. ఇంతలో పుష్ప అక్కడికి వచ్చి ప్రెస్ వాళ్ళు వచ్చారు అనడంతో రిషి నువ్వు వెళ్లి డ్రస్సు చేంజ్ చేసుకుని రా అని చెప్పి పుష్ప ని అక్కడ నుంచి పిలుచుకొని వెళ్తాడు.
ఆ తరువాత వసుధార డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి జగతి వస్తుంది. మొదట తన బ్రమ అనుకున్న వసుధార ఆ తర్వాత జగతి నిజంగానే వచ్చింది అని తెలుసుకొని సంతోషంతో జగతిని హత్తుకుంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి రిషి వస్తాడు. డాడ్ వచ్చారా మేడం అనటంతో తన గురించి అడగలేదు అని జగతి ఫీల్ అవుతూ ఎమోషనల్ అవుతుంది. అప్పుడు రిషి డాడీ ఎక్కడున్నారు? ఇక్కడ దాపరికాలు చాలు వచ్చేయండి డాడ్ అని అనగా అప్పుడు జగతి రాలేదు అని సైగ చేయడంతో అర్థమైంది మేడం మీ శిష్యురాల కోసం మీరు వచ్చారు కానీ మా డాడ్ నాకోసం రాలేదు అని అంటాడు రిషి. అంత పెద్ద తప్పు నేను ఏం చేశాను మేడం.
తప్పు చేయని ఖైదీకి శిక్ష వేసినట్టు నాకు వేశారు నరకం అనుభవిస్తున్నాను అని అనడంతో జగతి ఆ మాటలకు ఎమోషనల్ అవుతుంది. అప్పుడు కనీసం మీరైనా చెప్పండి మేడం ఆ తప్పు ఏంటో తెలుసుకొని సరిదిద్దుకుంటాను అని రిషి అనగా ఆ మాటలకు జగతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ తర్వాత వసుధార నువ్వు అక్కడికి వచ్చేయి డ్రెస్ చేంజ్ చేసుకుని అని చెప్పి వెళ్తూ మేడం ముందుగా మీరే వచ్చి వసుధారకు సంబంధించిన ఇంట్రడక్షన్ ఇస్తే బాగుంటుంది అని అంటాడు. మరొకవైపు జగతి ఫణీంద్ర తో మాట్లాడుతూ ఉంటుంది.
Read Also :
- Guppedantha Manasu serial Oct 4 Today Episode : మహేంద్రకు మనసులో మాట చెప్పిన రిషి.. వసు చిలిపి పనులు చూసి మురిసిపోతున్న రిషి..?
- Guppedantha Manasu: దగ్గరవుతున్న వసు, రిషి.. దేవయాని ఏం చేయనుంది..?
- Guppedantha Manasu Oct 29 Today Episode : రిషి,మహేంద్రను ఒకటి చేయాలి అనుకుంటున్న వసు.. ఇంటికి వెళ్ళిపోదాం అంటున్న జగతి..?















