Vasthu Tips : చాలా మంది లక్షల సంపాదిస్తుంటారు. కానీ సేవింగ్స్ మాత్రం ఏమీ ఉండదు. నెలజీతం ఇంటికి ఎంత వచ్చినా రూపాయి మిగలక ననా ఇబ్బందులు పడుతుంటారు. మరికొందరేమో సంపాదించేది తక్కువే అయినా సేవింగ్స్ ఎక్కువగా చేస్కుంటా హాయిగా గడుపుతారు. ఇందతా వారి ఆర్థిక ప్రాధాన్యతను బట్టి ఉంటుంది. అయితే మన ఇంటి వాస్తు, జ్యోతిష్యం ప్రకారం రాశులు కూడా డబ్బు, ఆరోగ్యం, ఆనందంపై ప్రభావం చూపిస్తాయట. కానీ డబ్బు, అబివృద్ధి సాధించడం కోసం రాత్రి పగళ్లు కష్టడాల్సి వస్తుంది. కానీ కొందరికీ లక్ష్మీ దేవి కటాక్షం ఉండటం వల్ల ఎక్కువ డబ్బును పొందగల్గుతారు.
మీకూ అలాగే కావాలనుకుంటే.. రోజూ రాత్రి ఇలా చేయాలని వేద పండితులు చెబుతున్నారు.
పడుకునే ముందు రాత్రి వంట గదిలోని పాత్రలన్నీ కడిగి శుభ్రం చేసుకోవాలి. దీంతో లక్ష్మీదేవి సంతోషిస్తుందట. అలాగే రాత్రి వేళ పడక గదిలో కర్పూరం వెలిగించడం వల్ల మంచి జరుగుతుందట.
సాయంకాలం కాగానే ఇంటి గడప వద్ద నెయ్యితో దీపం వెలిగిస్తే లక్ష్మీ దేవి ఇంటిని వదిలి పోదని చెబుతున్నారు. అలాగే సాయంత్రం పూట ఎట్టి పరిస్థితుల్లోనూ దానాలు చేయకూడదిన వేద పండితులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పాలు, పెరుగు, ఉప్పు వంటి వాటిని ఎవరికీ ఇవ్వకూడదట.