Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో హని కావాలనే తులసిని రోడ్లు మొత్తం తిప్పుతూ తప్పు అడ్రస్ చెబుతుంది.
ఈరోజు ఎపిసోడ్ లో తులసికి హనీ ఇంటి అడ్రస్ తప్పుగా చెబుతుంది. అప్పుడు తులసి ఈసారి కరెక్ట్ గా చెప్పు అమ్మ మీ ఇంట్లో మీ వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు అని చెప్పగా సరే అని అంటుంది హని. మరొకవైపు సామ్రాట్ పోలీసులు హనీ కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడే రోడ్డుపై ఐస్ క్రీమ్ కనిపించడంతో హనీ ఐస్ క్రీమ్ కావాలి అని అనగా ఐస్ క్రీమ్ కొనిపెడుతుంది. ఇంతలో ప్రేమ్ ఫోన్ చేసి మాట్లాడాలి అని అనటంతో మరి కొద్ది సేపట్లో ఇంటికి వస్తాను అక్కడికి రా అని చెబుతుంది తులసి.
ఆ తర్వాత హనీ రోడ్డు మీద బెలూన్స్ కొనుక్కొని ఆడుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత సామ్రాట్ వాళ్ళ బాబాయ్ తో హనీ గురించి చెప్పుకుని బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత సి సి ఫుటేజ్ ఆదారంగా తులసి హనీ ఉన్న ఫోటోని పోలీసులు తీసుకొని వెళ్లి సామ్రాట్ కి చూపిస్తారు. వెంటనే సామ్రాట్ తులసి కుటుంబం పై సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్పగా పోలీసులు నేరుగా తులసి ఇంటికి వెళ్తారు. అక్కడ తులసి లేకపోవడంతో వెంటనే పరంధామయ్య అనసూయను అరెస్టు చేస్తారు.
అప్పుడు అంకిత దివ్య వాళ్ళు ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా పోలీస్ స్టేషన్ కు తీసుకొని వెళ్తారు. ఇంతలో ప్రేమ్ అక్కడికి రావడంతో అప్పుడు దివ్య ప్రేమ్ కి జరిగింది మొత్తం వివరిస్తుంది వెంటనే పోలీస్ స్టేషన్ కు బయలుదేరుతాడు. ఆ తర్వాత దివ్య జరిగిన మొత్తం తులసికి వివరించడంతో పాపని తీసుకుని పోలీస్ స్టేషన్ కు వెళుతుంది తులసి.
సామ్రాట్ వచ్చి ఆ ముసలి వాళ్లు నిజం చెప్పారా అని అనగా లేదు అనడంతో వాళ్లతో ఎలాగైనా నిజం చెప్పాలి వాళ్ళు అలాగే అబద్ధాలు చెబుతాడు అంటూ సామ్రాట్ కోసం రగిలిపోతూ ఉంటాడు. ఇంతలోనే తులసి హనీ ని తీసుకొని పోలీస్ స్టేషన్ కు వస్తుంది. అప్పుడు తులసి మీ పాపని నీకు అప్పగించాను కదా మా వాళ్లను వదిలేయమని చెప్పండి అని అనగా వెంటనే సామ్రాట్ గన్ తీసుకొని తులసి ని కాల్చబోతాడు.
అప్పుడు తులసి జరిగింది మొత్తం వివరించినా కూడా సామ్రాట్ వినిపించుకోకుండా అపార్థం చేసుకుని తులసిని కూడా జైల్లో పెట్టిస్తాడు. ఇంతలోనే ప్రేమ్ అక్కడికి వచ్చి పోలీసులపై సామ్రాట్ పై కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు అనసూయ దంపతులు జరిగింది మొత్తం ఒకసారి గుర్తు తెచ్చుకొని ఆ కార్ నెంబర్ వాళ్ళు చెప్పమ్మా మనం బయటికి వెళ్దాం అని అనగా వెంటనే తులసి మనం బయటికి వెళ్తే మీ అబ్బాయిని లోపలి వేస్తారు అంటూ అసలు విషయం చెబుతుంది.
తులసి అసలు విషయం చెప్పడంతో ప్రేమ్ అనసూయ దంపతులు షాక్ అవుతారు. ఆ తర్వాత ఈ విషయాన్ని అంకిత వరకు తెలియకుండా ఎలా అయినా లాయర్ ని పిలుచుకుని వచ్చి మమ్మల్ని విడిపించు అని ప్రేమికు చెప్పడంతో ప్రేమ్ సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు నందు లాస్య యాక్సిడెంట్ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉండగా లాస్య నందు పై ఫైర్ వుతుంది.
ఆ తరువాత హనీ వైపు చూస్తూ సామ్రాట్ కాస్త ఎమోషనల్ గా మాట్లాడుతాడు. రేపటి ఎపిసోడ్లో లాస్య వాళ్ళు సామ్రాట్ దగ్గరికి వెళ్ళగా ఇంతలో సామ్రాట్ కి పోలీసులు ఫోన్ చేస్తారు. నా కూతురికి యాక్సెంట్ చేసిన వాళ్ళు దొరికారా అని అడగగా లేదు అనడంతో ఆ తులసి నిజం చెప్పిందా అని అనగా వెంటనే నందు లాస్య ఒకసారిగా షాక్ అవుతారు. ఆ తులసికి నేనంటే ఏందో చూపిస్తా చిత్రహింసలు పెడతాను అనగా నందు బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత నందు లాస్యలు ఆ విషయం గురించి టెన్షన్ పడుతూ ఉండగా సామ్రాట్ కి వాళ్ళ పై అనుమానం వస్తుంది.
Rythu Bharosa : తెలంగాణ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా డబ్బులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.…
Jeera Saunf water : మీ ఇంటి వంటగదిలో సులభంగా లభించే అనేక దినుషుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని…
CBSE Admit Card 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025 బోర్డు పరీక్షలకు అడ్మిట్…
NPS Zero Tax : మీరు వేతనజీవులా? ప్రతినెలా జీతం పొందే వ్యక్తి అయితే.. మీకో గుడ్ న్యూస్.. బడ్జెట్…
Vitamin E deficiency : శరీరం సరిగ్గా పనిచేయడానికి అన్ని విటమిన్లు, ఖనిజాలు అవసరం. ఏదైనా విటమిన్ లోపం ఉంటే..…
Lungs Detox : ఊపిరితిత్తులను శుభ్రపరిచే మార్గాలివే : ప్రస్తుత మన జీవనశైలి.. మన ఊపిరితిత్తులపై చాలా చెడు ప్రభావాన్ని…
This website uses cookies.