Intinti Gruhalakshmi November 10 Today Episode : సంతోషంలో తులసీ కుటుంబం.. బాధతో కుమిలిపోతున్న నందు..?

tulasi family get happy in todays intinti gruhalakshmi serial episode
tulasi family get happy in todays intinti gruhalakshmi serial episode

Intinti Gruhalakshmi November 10 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తులసి సామ్రాట్ ఇద్దరూ షాపింగ్ చేసి ఇంటికి వస్తారు.

ఈరోజు ఎపిసోడ్ లో తులసి సామ్రాట్ నవ్వుకుంటూ ఇంటికి వెళుతుండగా ఇంటికి ఎదురుగా ప్రేమ్,శృతి అంకిత, దివ్యలు అక్కడ ఉండడం చూసి ఆశ్చర్య పోతుంది తులసి. అప్పుడు దివ్య వాళ్ళు అంకుల్ ఒక ఫోటో తీసుకొని చాలా క్యూట్ గా ఉంది అనడంతో నా పర్మిషన్ కాదమ్మా మీ అమ్మ పర్మిషన్ తీసుకో ఈరోజు మీ అమ్మ నా బాస్ అని అంటాడు సామ్రాట్.

Advertisement
Intinti Gruhalakshmi November 10 Today Episode
Intinti Gruhalakshmi November 10 Today Episode

అప్పుడు వారందరూ కలిసి సరదాగా ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు దివ్య తులసిని గట్టిగా హగ్ చేసుకుని మామ్ నువ్వు కోపంగా వెళ్ళిపోయావు రెండు రోజుల్లో ఇంటికి వస్తావు అనుకున్నాము కానీ వేరే ఇల్లు తీసుకున్న తర్వాత ఇక రావని తెలిసింది మామ్ అని అంటుంది. అప్పుడు అంకిత వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు.

ఇప్పుడు సామ్రాట్ చేతిలో ఉన్న సామాన్లు తీసుకొని లోపలికి వెళ్దాం పదండి అని అందరూ కలిసి ఇంటిని ఆనందంగా సర్దుతూ ఉంటారు. ఇల్లంతా వస్తువులతో డెకరేషన్ చేసిన తర్వాత తులసి పాలు పొంగిస్తుంది. అప్పుడు అందరి వెళ్లి కూర్చొని నేను పాయసం తీసుకుని వస్తాను అని అంటుంది తులసి.

Advertisement

మరొకవైపు నందు బాధపడుతూ ఎమోషనల్ అవుతూ ఉండగా ఏంటో ఈ నందు చెబితే వినడు ఎమోషనల్ ఫీల్ అవుతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది లాస్య. అప్పుడు లాస్య వచ్చి ఎంత మాట్లాడించినా కూడా నందు పలకకుండా బాధపడుతూ ఎమోషనల్ అవుతూ ఉంటాడు. అప్పుడు లాస్య ఎంత ఓదార్చడానికి ప్రయత్నించినా కూడా నందు పట్టించుకోకుండా బాధపడుతూనే ఉంటాడు.

 Intinti gruhalakshmi నవంబర్ 10 ఎపిసోడ్ : కొత్త ఇంట్లో  తులసి,సామ్రాట్ పూజ..

మరొక వైపు తులసి అందరికీ పాయసం తీసుకుని వస్తుంది. అప్పుడు అందరూ కలిసి పాయసం తింటూ ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అందరు పాయసం తింటూ ఉండగా తులసి పరంధామయ్య అనసూయ లను తలుచుకొని బాధపడుతుంది. ఇప్పుడు ప్రేమ్ వాళ్ళు వెళ్ళొస్తాము అమ్మ అని అనగా నాకు చెప్పకుండా వెళ్లిపోండి రా అని అంటుంది తులసి.

Advertisement

అప్పుడు వాడందరూ వెళ్ళిపోతూ ఉండగా తులసి అది చూసి బాధపడుతుంది. మరొకవైపు లాస్య ఏమి అయ్యింది నందు ఎందుకు అంతలా బాధ పడుతున్నావ్ అనగా వెంటనే నందు నన్ను ఒంటరిగా వదిలేయ్ లాస్య అని కోపంగా అంటాడు. ఆ తరువాత తులసి,సామ్రాట్ పూజ చేస్తూ సామ్రాట్ కి ఫోన్ రావడంతో బయటికి వెళ్ళగా ఏంటి బాబాయ్ అర్జంట అని అనగా అవును రా అర్జెంటే పక్కన తులసి ఉందా ఒక్కతే ఉంటే ఇప్పుడే సరైన సమయం నీ మనసులోని మాటను బయటకు పెట్టు అని అంటాడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్.

ఏం చెప్పాలి బాబాయ్ అనడంతో నీ మనసులో తులసి ఉన్న విషయం చెప్పు అనగా వెంటనే సామ్రాట్ సీరియస్ అవుతూ నా మనసులో తులసి గారి మీద ఎటువంటి ఉద్దేశం లేదు అని అంటాడు. అక్కడికి వచ్చిన తులసి ఆ మాటలు వింటుంది. మరొకవైపు నందు అనసూయలు అందరూ కలిసి పరంధామయ్య పుట్టినరోజు వేడుకలు చేయాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు.

Advertisement

Read Also : Intinti Gruhalakshmi November 9 Today Episode : జరిగిన విషయం తలచుకొని బాధతో కుమిలిపోతున్న నందు.. సంతోషంలో తులసి సామ్రాట్..?

Advertisement