Telugu NewsLatestTSLPRB: తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల తేదీలు విడుదల..!

TSLPRB: తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల తేదీలు విడుదల..!

TSLPRB: తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షలు తేదీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రిలిమినరీ రాత పరీక్షల తేదీలను రిక్రూట్ మెంట్ బోర్డు తెలిపింది. ఆగస్టు 7వ తేదీన ఎస్సై, 21వ తేదీన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఎస్సై రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈనెల 30 నుంచి, కానిస్టేబుల్ అభ్యర్థులు ఆగస్టు 10 నుంచి బోర్డు వెబ్ సైట్ లో హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేస్కోవచ్చని సూచించింది.

Advertisement

Advertisement

మొత్తం 557 ఎస్సై, 15, 664 పోస్టులకు ఏప్రిల్ 25న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మరో 614 ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు ఏప్రిల్ 28న నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు 2.54 లక్షల మంది అభ్యర్థులు ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు హాజరు కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానిస్టేబుల్ పోస్టులకు 6.50 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిపారు. ఎస్సై పోస్టులకు హైదరాబాద్ సహా రాష్ట్రంలోని 20 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా.. కానిస్టేబుల్ పరీక్షలకు హైదరాబాద్ సహా 40 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు