Mothers sacrifise: 30 ఏళ్లుగా పురుషుడిలా బతుకుతోంది.. ఎవరి కోసం అలా చేసిందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు!

Mothers sacrifise: అమ్మ ప్రేమ గురించి ఎన్ని మాటలు చెప్పినా, పాటలు పాడినా అంత అనుభూతిని పొందలేమేమో. కానీ ఆమె మనం బాధలో ఉన్నప్పుడు చేసే సేవలు, త్యాగాలు చూస్తే మాత్రం కచ్చితంగా ఆమె మనసును అర్థం చేసుకోగల్గుతాం. అలా చేస్తేనే తెలుస్తుందా.. ప్రేమ చూపిస్తే అర్థం కాదా అనిపిస్తుందా… సంతోషంలో ఉన్నప్పుడు చూపించే ప్రేమ కంటే బాధలో ఉన్నప్పుడు చూపించే ప్రేమను ఎక్కువగా అనుభవిస్తాం. అయితే తమిళనాడుకు చెందిన పెచ్చియామ్మాల్ కు 20 ఏళ్ల వయసులోనే పెళ్లి అయింది. దురదృష్ట వశాత్తు పెళ్లి జరిగిన 15 రోజులకే భర్త చనిపోయాడు. అప్పటికే ఆమె గర్భం దాల్చడంతో.. పాప గురించే ఆలోచిస్తూ ఎన్నో బాధలను దిగమింగింది. చిన్న చిన్న పనులు చేసుకుంటూనే కాలాన్ని వెళ్లదీసింది. ఆమె పండంటి పాపకు జన్మనిచ్చింది.

Advertisement

Advertisement

ఆ తర్వాత పాప కోసం పని చేయడం ప్రారంభించింది. కానీ అక్కడ ఉండే పురుషులు… ఆమెను అభ్యంతరకరంగా చూడటం మొదలు పెట్టారు. కొందరు నేరుగా వెళ్లి తమతో ఉండిపొమ్మని కూడా అడిగారు. ఈ వేధింపులు తట్టుకోలేక పని మానేయాలనుకుంది. కానీ పాప గుర్తుకు వచ్చి ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. తాను పురుషుడిగా మారి పాపను పెంచాలనకుంది. అనుకున్నదే తడవుగా హెయిర్ కటింగ్ షాపుకి వెల్లి క్రాఫ్ చేయించుకుంది. పురుషుడిలా వేష ధారణ మార్చేసింది. అలాగే పేరు కూడా మార్చుకొని హోటల్ లో పని చేయడం ప్రారంభించింది. అక్కడ అందరా ఆమెని ముత్తు మాస్టర్ అని పిలుస్తారు. మరి కొందరేమో అన్నాచ్చి అని అంటే పెద్దన్న అని పిలుస్తారు. దాదాపు 30 ఏళ్లుగా ఆమె ఇలాగే జీవనం సాగించింది. కూతురు పెళ్లి అప్పుడు అసలు విషయాన్ని బయట పెట్టి ఆమె పెళ్లి చేసేసింది. తన కూతురు కోసం మాత్రమే తాను పురుషుడిలా వస్త్రాలు ధరించి కాలం వెళ్లదీశానని వివరించింది.

Advertisement
Advertisement