Train Ticket: ప్రపంచంలోనే అతి పెద్ద నెట్వర్క్ కలిగిన వాటిలో భారతీయ రైల్వే నాలుగవ స్థానంలో ఉంది. ప్రతిరోజు రైలు మార్గంలో కొన్ని లక్షలమంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా రైలులో ప్రయాణం ఎంతో సురక్షితం అని భావించి దూర ప్రయాణాలు చేసేవారీ దగ్గర నుంచి సమీప ప్రాంతాలకు కూడా రైలు ప్రయాణం చేస్తూ ఉంటారు.ఇక రైలు ప్రయాణం చేయాలంటే తప్పనిసరిగా టికెట్ అవసరం. టికెట్ లేకుంటే భారీ మొత్తంలో జరిమానా కట్టాల్సి ఉంటుంది. అయితే చాలామంది రైలులో ప్రయాణం చేసే సమయంలో పొరపాటున మనకు తెలియకుండా మన టికెట్ ఎక్కడో పోగొట్టుకొని చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము.
టికెట్ కలెక్టర్ వచ్చి టికెట్ అడిగితే ఏం చేయాలి అని గాబారా పడుతుంటారు.అయితే టికెట్ పోగొట్టుకుపోతే ఇకపై బాధపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు వెంటనే మీరు టికెట్ కలెక్టర్ దగ్గరకు వెళ్లి మీ పరిస్థితిని తెలియజేసి అతనిని డూప్లికేట్ టికెట్ ఇవ్వమని అడగవచ్చు. అయితే ఇందుకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. స్లీపర్ క్లాస్ రిజర్వేషన్ అయితే 50 రూపాయలు, సెకండ్ క్లాస్ వారు వంద రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని భారతీయ రైల్వే సూచించింది.ఒకవేళ మీరు పోగొట్టుకున్న టికెట్ దొరికితే కనుక మీరు చెల్లించిన జరిమానా ఐదు శాతం కట్ చేసి మిగతాది వెనక్కి ఇవ్వాల్సి ఉంటుందని భారత రైల్వే పేర్కొంది.
ఇక రైలు ప్రయాణం చేసే వాళ్ళు ఎక్కువగా మిడిల్ బెర్త్ తీసుకోవడానికి ఇష్టపడరు. మిడిల్ బెర్త్ ఉన్నవాళ్లు తరచూ ఎక్కి దిగాలి అన్నా ఎంతో ఇబ్బందిగా ఉంటుంది అలాగే కింద కూర్చున్న ప్యాసింజర్లకి కూడా సౌకర్యవంతంగా ఉండదు కనుక కొన్నిసార్లు పెద్ద ఎత్తున గొడవలు జరిగే సూచనలు ఉంటాయి. అందుకే భారత రైల్వే ఈ విషయంలో కూడా ఒక నియమం అమలులోకి తీసుకువచ్చింది. మిడిల్ బర్త్ ప్యాసింజర్ రాత్రి పది గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మిడిల్ బర్త్ డే ఓపెన్ చేసుకోవాలని భారత రైల్వే పేర్కొంది.
Tufan9 Telugu News And Updates Breaking News All over World