Karthika Deepam june 10 Today Episode : శోభకు స్ట్రాంగ్ బుద్ధి చెప్పిన జ్వాలా..హిమ మాటలకి షాక్ అయిన శోభ,నిరుపమ్..?

Karthika Deepam june 10 Today Episode
Karthika Deepam june 10 Today Episode

Karthika Deepam june 10 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో జ్వాలా ఆటోలో కూర్చొని నిరుపమ్ ఫోటోలు చూసి మురిసిపోతూ ఉంటుంది.

ఈరోజు ఎపిసోడ్ లో నిరుపమ్ అనాధాశ్రమం దగ్గర ఒంటరిగా కూర్చుని హిమ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. మరొకవైపు జ్వాల ఆటలో ఒక జ్యోతిష్యుడిని ఎక్కించుకొని తీసుకుని వెళ్తుంది. ఆ జ్యోతిష్యుడు జ్వాల చెయ్యి చూసి నాకు మతి పోతుంది అమ్మ అని అంటాడు. వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే శోభ అక్కడికి వస్తుంది.

Advertisement
Karthika Deepam june 10 Today Episode
Karthika Deepam june 10 Today Episode

జ్వాలా ని చూసి ఆఖరికి జాతకం కూడా చెప్పించుకుంటున్నావా అని అంటుంది. అప్పుడు జ్వాలా అని జాతకం నేను చెప్తాను అంటూ శోభా నీకు లైఫ్ ఉండదు లవ్వు ఉండదు అని అంటుంది. ఆ తర్వాత జ్వాలా చేతి పై హెచ్ అనే అక్షరం పచ్చబొట్టు చూసిన శోభ దాని గురించి వివరాలు అడుగుతుంది. అంత అప్పుడు జ్వాలా అది నా శత్రువు పేరు అని చెబుతుంది.

అయినా కూడా శోభ మరిన్ని వివరాలు అడగడంతో ద్వారా తనదైన శైలిలో సమాధానం ఇస్తుంది. ఆ తరువాత నిరుపమ్, జ్వాల ఇద్దరు రెస్టారెంట్ లో కలుస్తారు. అప్పుడు వాళ్ళ మీ అమ్మ మీద ప్రేమ పెంచుకోండి కానీ మీ జీవితానికి సంబంధించిన విషయాలు మీరే నిర్ణయం తీసుకోండి అని అంటుంది. అలాగే మేడం నన్ను తిట్టినా నేను పడతాను మీ అమ్మ నే కదా అని అంటుంది.

Advertisement

అప్పుడు నిరుపమ్ మౌనంగా ఆలోచిస్తూ హిమకు సంబంధించిన విషయాలు జ్వాలాకు చెప్పనవసరం లేదు అని అంటాడు. మరొకవైపు సౌందర్య, ఆనందరావుఉ హిమ గురించి ఆలోచిస్తూ హిమ కు క్యాన్సర్ ఉంది అని తెలిసిన తర్వాత ఏం మాట్లాడతాను అని అనుకుంటూ ఉంటారు.

అప్పుడు సౌందర్య వెళ్లి హిమకు జ్యూస్ ఇస్తూ ఉండగా అప్పుడు నిరుపమ్ వచ్చి ఇకపై హిమకు అన్ని సేవలు నేనే చేస్తాను. ఒక బావగా కాదు భర్తగా అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు స్వప్న,సత్య ఎదురు కోపంగా వెళ్లిపోతారు. అప్పుడు హిమ నాటకం ఆడి సౌర్య,నిరుపమ్ బావని కలుపుదాము అనుకుంటే బావ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు ఏంటి అని అనుకుంటూ ఉంటుంది.

Advertisement

రేపటి ఎపిసోడ్ లో హిమ నిరుపమ్ తో మాట్లాడుతూ నువ్వు వేరే అమ్మాయిలు నా ప్రేమను చూసుకోవాలి బావ అని అడగగా, ఆ అమ్మాయి ఎవరు హిమ అని అడగగా జ్వాలా అని చెబుతుంది. ఇక హిమ మాటలు విన్న నిరుపమ్, శోభ ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Read Also : Karthika Deepam: హిమను చూసి ఎమోషనల్ అయిన నిరుపమ్… బాధలో ప్రేమ్.?

Advertisement