...

Sunami sudhakar: 6 వేల షోలు చేసినా రాని పేరు.. జబర్దస్త్ తోనే వచ్చిందట!

Sunami sudhakar: నాటి స్టార్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, రజనీ కాంత్, చిరంజీవి, బాలతకృష్ణ, నాగార్జును… ఇలా దాదాపు 20 మంది నటుల హావభావాలను ఒకే స్టేజీపై పలికించగల సత్తా ఉన్న కమెడియన్ సునామీ సుధాకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 2013 నుంచి చంద్ర టీమ్ లో చేస్తున్నానని చెప్పాడు. అలాగే చమ్మక్ చంద్ర, మిమిక్రీ రాము, సుధాకర్ కలిసి చేసిన బతుకు జట్కా బండి అనే స్కిట్ నుంచే ఆయనకు చాలా గొప్ప పేరు వచ్చిందని అంటున్నాడు. అయితే నాగబాబు గారి సూచన మేరకే తాను టీం లీడర్ గా చేశానని అంటున్నారు.

అయితే తాను మొత్తం 20 దేశాల వరకు తిరిగానని.. మొత్తంగా 6 వేల షోలు చేశానని చెప్తున్నాడు. కానీ అప్పుడు రాని ఫేం జబర్దస్త్ వచ్చాక వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఆర్టిస్టులు అన్నాక అన్ని క్యారెక్టర్లు చేయాల్సిందేనని… ఇంకొకరి మీద పంచ్ ల్ వేయాలి, తమ మీద తామే వేస్కోవాలని.. పర్సనల్ గా అస్సలే ఫీల్ అవ్వకూడదని అంటున్నాడు. అయితే తనకు స్టార్ డమ్ వచ్చేందుకు చాలా కష్టపడ్డానని, ప్రస్తుతం చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నానని అంటున్నాడు.