Sudheer Chammak Chandra : అందరూ ఊహించినట్టుగానే జరుగుతోంది. సొంత గూటికే మళ్లీ ఒక్కొక్కరుగా చేరుతున్నారు. ఇటీవలే గెటప్ శ్రీను అనూహ్యంగా జబర్దస్త్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు అదే బాటలో సుధీర్, చమ్మక్ చంద్ర కూడా వచ్చేసినట్టు గాసిప్ వినిపిస్తోంది. ఎందుకంటే.. జబర్దస్త్ కామెడీ షో నుంచి చాలామంది కంటెస్టెంట్‌లు బయటకు వెళ్లడం తెలిసిందే. ఇక మల్లెమాల గురించి కిరాక్ ఆర్‌పి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.. అప్పట్లో దీనిపై ఆటో రాంప్రసాద్, హైపర్ ఆది కూడా గట్టిగానే స్పందించారు.
జబర్దస్త్ షోతో ఫేమ్ తెచ్చుకున్న గెటప్ శీను, సుడిగాలి సుధీర్ మల్లెమాలని వదిలేసి వెళ్లడంతో చాలా మంది జబర్దస్త్ షో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. మల్లెమాలలోకి ఎప్పుడు ఎంట్రీ ఇవ్వడం జరగదంటూ అనేక వార్తలు వచ్చాయి. ఈ మధ్యనే గెటప్ శ్రీను జబర్దస్త్‌లో ఎంట్రీ ఇచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. సుడిగాలి సుదీర్ కూడా ఎంట్రీ ఇవ్వాలని అతడి అభిమానులు కోరుకున్నారు. కానీ, సుధీర్ ఎంట్రీ ఇవ్వకపోవడంతో అభిమానకుల నిరాశే మిగిలింది.
చమ్మక్ చంద్ర జబర్దస్త్ నుంచి ఎప్పుడో వెళ్ళిపోయాడు. అదిరింది, కామెడీ స్టార్ వంటి షోలో మెరిశాడు. సుధీర్ కూడా మా టీవీలో సూపర్ సింగర్ షోతో యాంకర్‌గా చేస్తున్నాడు. మల్లెమాల ద్వారా ఎంతో పేరు తెచ్చుకున్న సుడిగాలి సుదీర్ ఈటీవీ చానల్‌ని వదిలి పక్క ఛానల్‌కి వెళ్లిపోయాడు. ఈ మధ్య ఈటీవీ 27వ వార్షికోత్సవం అంటూ ఒక ఈవెంట్‌ని ప్లాన్ చేసింది మల్లేమాల.
ఈ మధ్యనే షో ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ‘భలే మంచి రోజు’ రాబోతున్న ఈవెంట్‌లో సుదీర్, చంద్రలు సందడి చేయనున్నారు. సుధీర్ అభిమానులంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇది కేవలం ఈ ఒక్క షోకి అన్నట్టు తెలిసింది. ఈ షో ద్వారా సుదీర్ మల్లెమాలలో కంటిన్యూ అవుతారో లేదో చూడాలి.
Rythu Bharosa : తెలంగాణ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా డబ్బులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.…
Jeera Saunf water : మీ ఇంటి వంటగదిలో సులభంగా లభించే అనేక దినుషుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని…
CBSE Admit Card 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025 బోర్డు పరీక్షలకు అడ్మిట్…
NPS Zero Tax : మీరు వేతనజీవులా? ప్రతినెలా జీతం పొందే వ్యక్తి అయితే.. మీకో గుడ్ న్యూస్.. బడ్జెట్…
Vitamin E deficiency : శరీరం సరిగ్గా పనిచేయడానికి అన్ని విటమిన్లు, ఖనిజాలు అవసరం. ఏదైనా విటమిన్ లోపం ఉంటే..…
Lungs Detox : ఊపిరితిత్తులను శుభ్రపరిచే మార్గాలివే : ప్రస్తుత మన జీవనశైలి.. మన ఊపిరితిత్తులపై చాలా చెడు ప్రభావాన్ని…
This website uses cookies.