...

Business idea: సొంతంగా బిజినెస్ చేయాలనుకుంటున్నారా… అయితే ఇవి ట్రై చేయండి!

Business idea: ఉద్యోగాలు చేసి విసుగొచ్చిందా. మీకు మీరు సొంతంగా ఏదైనా జిబినెస్ ప్రారంబించాలనుకుంటున్నారా.. కానీ పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువ డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఏ ఫర్వాలేదు లెండి. తక్కువ పెట్టుబడితో అద్బుతమైన లాభాలను ఇచ్చే బెస్ట్ ఐడియాలు మీ కోసమే చెప్పబోతున్నాం. అయితే ఆ ఐడియా ఏంటో తెలుసుకోండి. ఐస్ క్రీమ్ పార్లర్. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరికనీ నచ్చేది ఐస్ క్రీమ్. చిన్న చిన్న ఫంక్షన్ ల నుంచి మొదలుకొని పెద్ద పెద్ద పెళ్లిళ్ల వరకు ఐస్ క్రీమ్ తప్పనిసరి. అలాంటి ఐస్ క్రీమ్ ను ప్రతిరోజూ తినే వాళ్లు కూడా చాలా మందే ఉంటారు. అయితే ఈ జిబినెస్ ప్రారంభిస్తే లాభాలు ఎక్కువ, నష్టాలు తక్కువ. కేవలం 10 నుంచి 20 వేల రూపాయల పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

వ్యాపారం పెరిగే కొద్దీ పెట్టుబడిని ఎక్కువ చేయొచ్చు. దేశంలోని ప్రతి ప్రాంతంలోనూ ఈ వ్యాపారం సాగుతోంది. అయతే మూడు నుంచి నాలుగు వందల చదరపు విస్తీర్ణంలో దీన్ని ప్రారంభిస్తే.. 5 నుంచి 10 మంది కూర్చొని తినేలా ఏర్పాటు చేస్కోవచ్చు. అలాగే ఐస్ క్రీమ్ పార్లర్ కోసం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి లైసెన్స్ తీస్కోవాల్సి ఉంుటంది. ఇది 15 అంకెల రిజిస్ట్రేషన్ నంబర్. మీరు బిజినెస్ ప్రారంభించాలనుకుంటే ఇదోసారి ట్రై చేయండి.