Squirrel in park: సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా ట్రెండ్ అవుతుంటాయి. ఏనుగులు, పాములు, పులులు, సింహాలకు సంబంధించిన వీడియోలు చూసేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు.
ఇష్టమైన జంతువులు వీడియోలు చూసినప్పుడు మనసుకు ఉల్లాసంగా, ఉత్సాహంగా అనిపిస్తుంటుంది. ఎంతటి ఒత్తిడినైనా ఇట్టే మాయం చేస్తుంటాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఆ వీడియో ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Scrat finally found his nut.. 😅 pic.twitter.com/LlBLH0tC9n
Advertisement— Buitengebieden (@buitengebieden) October 10, 2022
Advertisement
ట్విట్టర్ లో ప్రస్తుతం ఉడుతకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఒక చిన్ననల్లని అందమైన ఉడుత నీలి రంగు బంతితో ఆడుకుంటోంది. ఈ వీడియోను ట్విట్టర్ లో buitengebieden భాగస్వామ్యం చేశారు. దీనికి 1.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే వీళ్లు పోస్ట్ చేసే వీడియోల కోసం చాలా మంది వేచి చూస్తుంటారు.
ఈ ఉడుత వీడియోను తాజాగా పోస్ట్ చేయగా.. ఇప్పటి వరకు 10 లక్షల కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. అయితే ఇది 38 వేలకు పైగా లైక్ లు, వేల కామెంట్లు చేశారు.