Karthika Deepam january 10 Today Episode : కార్తీక్, దీప లను నిలదీసిన సౌందర్య…. షాక్ లో మోనిత..?

Karthika Deepam january 10 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో హిమ శౌర్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు.

Advertisement
Karthika Deepam january 10 Today Episode
Karthika Deepam january 10 Today Episode

ఈరోజు ఎపిసోడ్ లో సౌర్య, హిమ దగ్గర ఒక దొంగ డబ్బులు తీసుకొని పారిపోతూ ఉండగా అప్పుడు వాళ్ళు వెళ్లి పట్టుకుంటారు. అప్పుడు ఆ దొంగ హిమ, సౌర్య లను నెట్టేయడంతో వాళ్లను పడిపోకుండా కార్తీక్ పట్టుకుంటాడు. కార్తీక్ ని చూసి హిమ శౌర్య షాక్ అవుతారు. అప్పుడు కార్తీక్ ని హత్తుకొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు డాడీ మీ కోసం మేము ఎంతలా వెతుకుతున్నామో తెలుసా అని అంటుంది హిమ. ఆరోజు నాన్న కనిపించారు అంటే వినలేదు కదా చూడు ఇప్పుడు నాన్న వచ్చాడు అనడంతో అప్పుడు సౌర్య ఇన్ని రోజుల నుంచి వెతుకుతున్నాను.

Advertisement

 

Advertisement

కానీ మీరు నాకు కనిపించలేదు ఎందుకు నాన్న మా మీద కోపం వచ్చిందా మమ్మల్ని చూడాలనిపించడం లేదా అని అడుగుతుంది. అమ్మకి కూడా మమ్మల్ని చూడాలని అనిపించలేదా అమ్మ ఎక్కడ ఉంది మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళు నాన్న అని అంటుంది శౌర్య. అప్పుడు కార్తీక్ మీరు ఇంటికి వెళ్ళండి నేను అమ్మను తీసుకొని వస్తాను అనడంతో నీ మీద మాకు నమ్మకం లేదు నాన్న ఇప్పుడే నీతో పాటు మమ్మల్ని తీసుకెళ్ళు నిన్ను వదిలే ప్రసక్తి లేదు అనడంతో కార్తీక్ చేసేదేమీ లేక పిల్లలిద్దరిని తీసుకొని దీప దగ్గరికి బయలుదేరుతాడు. మరొకవైపు సౌందర్య దీపాచెయ్యి గట్టిగా పట్టుకోవడంతో ఏంటి అత్తయ్య వదిలిపోతుంది అని అనుకుంటున్నారా అని అంటూ అదేం లేదు నాకు ఇది నిజమా లేక కలనా అన్నట్టు ఉంది అని అంటుంది సౌందర్య.

Advertisement

అసలు మీరు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు? ఎందుకు మాకు కనిపించకుండా తిరుగుతున్నారు నా కొడుకు ఎక్కడ ఉన్నాడు అక్కడికి పిలుచుకుని వెళ్ళు అనగా తీసుకెళ్తాను అత్తయ్య అంతకంటే ముందు నేను నీతో ఒక విషయం మాట్లాడాలి అని అటుగా వెళుతుండగా ఇంతలోనే అక్కడికి కార్తీక్ హిమ శౌర్య వస్తారు. ఇప్పుడు అందరూ కలిసి ఒకచోట కలుసుకోవడంతో అమ్మ అని వెళ్లి సౌర్యహిమలు దీపని హత్తుకుంటారు. సౌందర్య కార్తీక్ ని చూసి పెద్దోడా అని సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు దీప ఇద్దరి పిల్లల్ని చూసి ఎమోషనల్ అవుతూ ఎందుకమ్మా మమ్మల్ని ఇన్ని రోజులు వదిలిపెట్టి ఉన్నారు.

Advertisement

నాన్నను అడిగితే నీ దగ్గరికి వెళ్ళాక చెప్తానని అన్నాడు నువ్వైనా చెప్పమ్మా అని అనడంతో మా అందరిదీ అదే ప్రశ్న ఎందుకు మీరు మా దగ్గరికి రాలేదు అని సౌందర్య అడగడంతో దీప కార్తీక్ ఒకరి వైపుకు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు కార్తీక్ నువ్వు అనుకున్నదే చేసావ్ దీప ఫ్యామిలీల అందరిని ఒక చోటికి కలిపావు అని అనుకుంటూ ఉంటాడు. దీప ఏమి అడిగినా చెప్పడం లేదు పిల్లలకు కనిపించకుండా నన్ను దూరంగా తీసుకు వచ్చింది అనడంతో ఇప్పుడు హిమబాధ పడుతూ అవునా అమ్మ మమ్మల్ని చూడాలనిపించడం లేదా అని అనడంతో అదేం లేదమ్మా అనే పిల్లల్ని గట్టిగా హత్తుకుని ఏడుస్తుంది.

Advertisement

అప్పుడు సౌందర్య హిమ శౌర్య ఎంత అడిగినా కూడా కార్తీక్, దీప ఇద్దరు మౌనంగా ఉంటారు. సరే మీరిద్దరూ ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారో నన్ను అక్కడికి తీసుకెళ్లండి అని సౌందర్య అనడంతో మీరు వెళ్ళండి మమ్మీ నేను దీపని తీసుకొని వస్తాను అనగా పిల్లలు ఇద్దరు దీప కార్తిక్ ల చేయి పట్టుకొని వద్దు నానమ్మ ఇప్పుడు వీళ్ళని వదిలిపెడితే మళ్ళీ కనిపించకుండా వెళ్ళిపోతారు అని అంటారు. అప్పుడు కార్తీక్,దీప చేసేది ఏమీ లేక సౌందర్య మాటలకు తలవంచుకుంటారు.. అప్పుడు అందరు కలిసి కార్తీక్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. మరొకవైపు మోనిత కార్తీక్ వాళ్ళ ఇంటికి రాగా అక్కడ తాళాలు వేసి ఉండడంతో ఎక్కడికి వెళ్లారు అని ఆలోచించుకొని తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్తుంది.

Advertisement

అప్పుడు ఆకలిగా అనిపించడంతో కిచెన్ లోకి వెళ్లి దోసెలు వేసుకుని తింటూ ఉంటుంది. ఇంతలోనే కార్తీక్ సౌందర్య దీప అందరూ కలసి అక్కడికి వస్తారు. అదేంటి డాక్టర్ బాబు ఇందాక తాళాలు వేసాను కదా పగలగొట్టారు. లోపల ఎవరున్నారు అని లోపలికి వెళ్ళగా అక్కడ మోనిత ఉండటం చూసి అందరూ షాక్ అవుతారు. ఇది ఇక్కడ ఎందుకు ఉంది అని అనడంతో బాగున్నారా అంటీ అంటూ వెటకారంగా మాట్లాడిస్తూ ఉంటుంది మోనిత. ఏయ్ ఫస్ట్ నువ్వు బయటికి వెళ్తావా లేదా అని దీప సీరియస్ అవుతుంది. అంటే నా కూతురు కొడుకు ఎక్కడ ఉన్నారో తెలిసి కూడా నాకు చెప్పలేదా అని అనడంతో నన్ను ప్రశ్నిస్తున్నారు ఏంటి ఆంటీ నీ కొడుకు నీ కోడలు చెప్పలేదా అని ఎంతో సౌందర్య వాళ్ళ వైపు చూస్తుంది.

Advertisement

Read Also : Karthika Deepam January 09 Today Episode : చారుశీలకు వార్నింగ్ ఇచ్చిన మోనిత.. సౌందర్య ఇంటికి వెళ్లిన దీప?

Advertisement
Advertisement