Solar Eclipse 2022 : దీపావళి పండుగ వచ్చేస్తోంది. హిందువులకు దీపావళి ఎంతో ఇష్టమైన పండుగ.. దీపావళి రోజున ప్రతిఒక్కరూ తమ ఇంటిని దీపాలతో అలకరించుకుంటారు. టపాసులతో మారుమోగుతూ దీపావళి రోజున ప్రతి ఇల్లూ సందడిగా మారిపోతుంటుంది. దీపావళి రోజున ఎవరైతే తమ ఇంట్లో దీపాలను వెలిగిస్తారో వారి ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించనట్టు అవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ ఏడాది కార్తీక మాసం అమావాస్య రోజు నుంచి ప్రారంభం కానుంది. దీపావళిని కన్నుల పండుగగా జరుపుకోనున్నారు. అయితే ఈ దీపావళి రోజునే సూర్యగ్రహణం ఏర్పడనుంది.
దాదాపు 27 ఏళ్ల క్రితం.. 1995లో దీపావళి రోజున సూర్యగ్రహణం వచ్చింది. ఈ ఏడాది దీపావళికి సూర్యగ్రహణం రాబోతోంది. 2022 రెండో, చివరి సూర్యగ్రహణం కానుంది. అమావాస్య తర్వాత ఈ సూర్యగ్రహణం ఏర్పడనున్నట్టు మహా పండితులు చెబుతున్నారు. అన్ని సూర్యగ్రహణంల మాదిరిగా కాకుండా.. ఈసారి కార్తీక మాసంలో అమావాస్య తర్వాత వచ్చే ఈ సూర్యగ్రహణానికి చాలా ప్రత్యేకత ఉందని అంటున్నారు.
ముఖ్యంగా ఈ సూర్య గ్రహం కారణంగా ఏయే రాశుల్లో పుట్టినవారిపై ఎలాంటి ప్రభావం చూపుతోందో తెలుసా? అయితే గ్రహణ ప్రభావం పడే రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం.. దేవుని అనుగ్రహం ఉంటే తప్ప ఇలాంటి గ్రహణ ప్రభావం నుంచి బయటపడటం కష్టమేనేనని అంటున్నారు. ఈ 5 రాశుల వారికి అత్యంత గడ్డుకాలమని చెప్పవచ్చు. ఇంతకీ ఏ రాశుల వారిపై సూర్య గ్రహణ ప్రభావం ఉంటుంది.. వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఇప్పడు తెలుసుకుందాం.
ఈ 5 రాశులవారిపైనే సూర్యగ్రహణ ప్రభావం ఎక్కువ :
1. సింహ రాశి :
మీది సింహరాశి అయితే భయమే అక్కర్లేదు. ఎందుకంటే.. ఈ రాశిగల వ్యక్తులకు ఆశించిన ఫలితాలే ఉంటాయట.. ఈ సింహరాశి వారు మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వీరిపై గ్రహణ ప్రభావం చాలా తక్కువనే చెప్పాలి. అయినప్పనటికీ గ్రహణ విడిచాక స్నానమాచరించి ప్రత్యేక పూజలు చేసుకోవాలి. ఈ రాశి వాళ్లకు సూర్య గ్రహణం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకపోయినా దేవతానుగ్రహం కోసం ప్రత్యేకించి పూజలు చేయించుకోవాలి.
2. మేష రాశి :
మీరు మేషరాశిలో పుట్టారా? అయితే మీపై సూర్య గ్రహణం ప్రభావం ఎక్కువగానే ఉంటుంది జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. గ్రహణం ప్రభావం తీవ్రత ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు.. వైవాహిక జీవితంలో ఇబ్బందులు కలగవచ్చు. అలాగే మానసిక ఒత్తిడికి చాలా గురవుతారు. మీ ఆలోచనలతో మనస్సును ఇబ్బంది పెట్టుకునే అవకాశం ఉంటుంది.
3. వృషభ రాశి :
ఈ రాశివారిపై కూడా సూర్యగ్రహణ ప్రభావం అధికంగా ఉంటుంది. అయినప్పటికీ ఈ రాశివాళ్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. వీరి జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురుకావొచ్చు. జీవితం మాత్రం చాలా అనందంగా ఉండవచ్చు. ఈ రాశివాళ్లు సూర్య గ్రహణం గురించి భయాందోళన చెందనక్కర్లేదు. మీపై గ్రహణ ప్రభావం ఉన్నప్పటకీ మీకు సానుకూల ఫలితాలు రావాలంటే తప్పనిసరిగా దేవుని ఆరాధిస్తే ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.
4. మిథున రాశి :
మిథున రాశిలో పుట్టిన వాళ్లకి సూర్యగ్రహణం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మిథున రాశివారికి అత్యంత గడ్డు కాలంమని చెప్పవచ్చు. గ్రహణ ప్రభావం కారణంగా వీరిలో మానసిక ఒత్తిడితో పాటు అనేక అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. గ్రహణ సమయంలో వీలైనంత వరకు అతిగా ఆలోచించరాదు. మీ మనస్సును అదుపులోకి ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దైవనామ స్మరణతో మీ మనస్సును శాంతపర్చుకోవడమే మంచిది.
5. కర్కాటక రాశి:
ఈ రాశి వారిపై సూర్య గ్రహణ ప్రభావం అంతాఇంతా కాదు.. ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. గ్రహణం మొదలైనప్పటి నుంచి గ్రహణం వీడేంతవరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఆర్థిక పరమైన సమస్యలకు ఎక్కువ ఆస్కారం ఉంది. మీరు ఏం చేయలేని సమయం.. కానీ, దైవారాధనతో పాటు ప్రత్యేకమైన పూజలు చేస్తుండాలి.