Intinti Gruhalakshmi Aug 30 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో తులసి మీడియాకు స్పీచ్ ఇస్తూ తన గతాన్ని తలుచుకొని ఎమోషనల్ అవుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో తులసి, మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ ఎమోషనల్ అవ్వగా వెంటనే సదరు విలేకర్ ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవచ్చా అని అడగగా అప్పుడు నందు టెన్షన్ పడుతూ కనిపిస్తాడు.. వెంటనే తులసి చెప్తాను కానీ ఇప్పుడు కాదు సమయం వచ్చినప్పుడు చెప్తాను అనటంతో నందు, లాస్య ఊపిరి పీల్చుకుంటారు. అప్పుడు తులసి మీడియా వారికి సామ్రాట్ గురించి సామ్రాట్ యొక్క గొప్పతనం గురించి వివరిస్తూ ఉంటుంది. అది చూసిన లాస్య రన్నింగ్ కామెంట్స్ చేస్తూ ఉంటుంది.
ఆ తర్వాత ఎవరో ఒక వ్యక్తి రావడంతో సామ్రాట్ అక్కడికి వెళ్లి పలకరించి ఒంటరిగా నిలబడగా ఇంతలో శృతి అక్కడికి వెళ్లి సామ్రాట్ ని డైరెక్ట్ గా ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పండి అని అడుగుతుంది. వెంటనే సామ్రాట్ నిర్మొహమాటంగా అడగండి అనడంతో వెంటనే శ్రుతి మీరు మా ఆంటీ ని ఇష్టపడుతున్నారా అని అడుగుతుంది. అప్పుడు సామ్రాట్ అవును మీ ఆంటీ నేను ఇష్టపడుతున్నాను. మీ ఆంటీ పట్టుదలను ఇష్టపడుతున్నాను అనేటంతో శృతి ఊపిరి పీల్చుకొని సంతోష పడుతూ సామ్రాట్ కి చేతులు జోడించి దండం పెడుతుంది.
ఆ తర్వాత ఇంటర్వ్యూలో గొప్పగా మాట్లాడినందుకు విలేకరులు తులసిని ప్రశంసిస్తూ ఉంటారు. అనంతరం కుటుంబ సభ్యులు కూడా తులసి గురించి గొప్పగా పొగుడుతూ ఉంటారు. ఆ తర్వాత మీడియా వారు భోజనం చేస్తూ తులసి సామ్రాట్ ల గురించి తప్పుగా మాట్లాడడంతో నందు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆ తర్వాత తులసి సామ్రాట్ కలసి భూమి పూజ చేస్తుండగా అది చూసిన నందు కోపంతో రగిలిపోతూ ఉంటాడు.
Intinti Gruhalakshmi Aug 30 Today Episode : సామ్రాట్.. షాక్ లో లాస్య..
ఆ తర్వాత వారిద్దరూ కలిసి హోమం జరిపిస్తూ ఉండగా అది చూసి కుటుంబ సభ్యులు సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు నందుని లాస్య కావాలనే మరింత రెచ్చగొడుతుంది. మరొకవైపు అవి కోపంతో రగిలిపోతూ అక్కడికి వస్తూ ఉంటాడు. ఇక పూజ చేసే సమయంలో తెల్ల కాగితంపై తులసి, సామ్రాట్ వేసిన చేతి గుర్తులు వెళ్లి నందు షర్టుపై ముద్ర పడడంతో నందు మరింత కోపంతో రగిలిపోతూ ఉంటాడు.
ఇప్పుడు పూజారి పూజ ముగిసింది అని చెప్పడంతో అందరూ సంతోషపడతారు. ఇంతలోనే అవి అక్కడికి వస్తాడు. అప్పుడు పూజారి గారు వ్యాపార భాగస్వామ్యం అంతే భార్యాభర్తల బంధం లాంటిది అని చెప్పడంతో అభిలాప్స్ కొడుతూ అక్కడికి వచ్చి బాగా చెప్పారు పూజారి గారు మీరు చెప్పిన ఆ మాట ఏ గ్రంథంలో ఉంది చెప్పండి అని అనగా వెంటనే పరంధామయ్య నువ్వు ఇక్కడ ఏం మాట్లాడడానికి వీల్లేదు అతిథిగా వచ్చావు అలాగే ఉండు అని అంటాడు.
అప్పుడు అభి నేను అతిథిగా రాలేదు మా అమ్మ కీ కి కొడుకుగా వచ్చాను అని రెచ్చిపోతూ ఉంటాడు. రేపటి ఎపిసోడ్ లో దీపక్ మీ నాన్న రెచ్చగొట్టి నిన్ను పంపించారు కదా అని అనటంతో వెంటనే అందు మర్యాద ఇచ్చి మాట్లాడు అని అంటాడు. వెంటనే దీపక్ నువ్వు మా అక్క భర్తగా ఉన్నప్పుడే నీకు మర్యాద ఇచ్చాను ఇప్పుడేంటి అని అనడంతో ఆ మాట విన్న సామ్రాట్ షాక్ అయ్యి నువ్వు తులసి గారి మాజీ భర్తవా అని అడగడంతో నందు ఒక్కసారిగా షాక్ అవుతాడు. చూడాలి మరి.