Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ధరణి, దేవయానిపై సీరియస్ అయినట్టు కలగంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో జగతి,మహేంద్ర ఇంట్లోకి వస్తూ ఉండగా వారికి దేవయాని ఎదురుపడి వెటకారంగా మాట్లాడుతుంది. వసుధార అలా మాట్లాడడానికి కారణం నువ్వే కదా జగతి అంటూ జగతిని నిలదీస్తుంది. జగతి తెలివిగా సమాధానం చెప్పడంతో వెంటనే మహేంద్రను అడగగా మహేంద్ర కూడా దేవయానికి గట్టిగా బుద్ధి చెప్పినట్టుగా మాట్లాడతాడు.

అందరి ముందు రిషీ మెడలో దండ వేయడం ఏంటి అని రగిలిపోతూ ఉంటుంది దేవయాని. ఆ విషయం గురించి పదే పదే జగతిని అడగగా అప్పుడు జగతి.. పూలదండ వేయించుకుంది రిషి.. వేసింది వసు.. మరి రిషీకి లేని బాధ మీకు ఎందుకు అని అడగడంతో దేవయాని మరింత కోపంతో పగిలిపోతూ ఉంటుంది. ఆ తర్వాత గౌతమ్ అక్కడికి రావడంతో గౌతమ్ ని కూడా ఇదే విషయం గురించి అడగగా రిషీ అక్కడికి వస్తాడు. అప్పుడు దేవయాని రిషి పై దొంగ ప్రేమ చూపిస్తూ వసుధర అలా దండ వేయడం గురించి వాళ్లు నానారకాలుగా మాట్లాడుతున్నారు అనడంతో జగతి, మహేంద్ర, గౌతమ్ ముగ్గురు షాక్ అవుతారు. అప్పుడు జగతిని ఉద్దేశించి మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
ఆ తర్వాత మహేంద్ర వర్మ బయటకు వెళ్తూ ఉండగా కార్లో పూలదండ చూసి మురిసిపోతాడు. మరొకవైపు గౌతమ్, వసు తో మాట్లాడుతూ రిషి దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. అప్పుడు గౌతమ్, వసు ని మీరు అంటూ పొగుడుతూ మాట్లాడగా వెంటనే రిషి ఎవరు రా ఫోన్లో అనడంతో నీకు తెలిసిన వ్యక్తి అని ఫోన్ ఇస్తాడు.
అప్పుడు హలో ఎవరు అని రిషి అడగగా పసుదార గొంతు వినిపించడంతో వెంటనే గౌతమ్ కి ఫోన్ ఇస్తాడు రిషి. ఎందుకు ఫోన్ చేశావు అని అనడంతో వెంటనే గౌతమ్ వసు నీ మెడలో ఎందుకు పూలదండ వేసింది అని తెలుసుకోవడానికి ఫోన్ చేశాను అని అంటాడు. అప్పుడు రిషి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది లేకపోతే వేయరు కదా అని చెప్పి తప్పించుకుంటాడు.
మరొకవైపు వసు కూడా రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే డ్రైవర్ తీసుకొని రావడంతో దేవయాని దాన్ని చూసి కోపంతో రగిలిపోతుంది. చెత్తని చెత్తలో పడేయాలి కానీ ఇలా ఇంట్లోకి తీసుకొని రాకూడదు అనడంతో ఇంతలో జగతి వచ్చి ఆ పూలదండని తీసుకుంటుంది. జగతి ఇంట్లోకి తీసుకున్న వెళ్లడానికి ప్రయత్నించగా దేవయాని వద్దు దానికి చెత్తలో పారేయమని చెబుతుంది.
ఇంతలోనే రిషి అక్కడికి రాగా ఆ పూలదండని చెత్తలో వేయడానికి వెళుతున్నాను అని జగతి చెప్పడంతో ఆ పూల దండను రిషీ తీసుకొని మీకు మనుషుల్ని వస్తువుల్ని చెత్తలో పారేయడం అలవాటే కదా అని పూలదండని తీసుకొని వెళ్తాడు. అప్పుడు జగతి దేవయాని వైపు చూసి కన్ను కొడుతుంది. ఆ తర్వాత దేవయానికి జగతి దంపతులు ఇద్దరూ గట్టిగా బుద్ధి చెప్పి వెళ్తారు. మరొకవైపు వసు కాలేజీలో నడుచుకుంటూ వెళ్తూ ఉండగా సాక్షి కావాలనే వసుధారతో గొడవ పెట్టుకుంటుంది.
Read Also : Guppedantha Manasu july 2 Today Episode : దేవయానికి ఊహించని షాక్ ఇచ్చిన జగతి.. దేవయానిపై ఫైర్ అయిన ధరణి..?