RRR Naatufied in USA : అమెరికాలో ‘నాటు నాటు’ సాంగ్.. నాటు స్టెప్పులతో టెడ్డీ డాన్స్.. దుమ్ములేపారుగా..!

rrr-natu-natu-song-rrr-movie-natu-natu-song-dance-video-viral-from-america
rrr-natu-natu-song-rrr-movie-natu-natu-song-dance-video-viral-from-america

RRR Naatufied in USA : ఎక్కడ చూసినా ఆర్ఆర్‌ఆర్ మానియానే.. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్ వినిపిస్తోంది. అమెరికాలోని మన తెలుగువాళ్లు ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాటకు స్టెప్పులతో ఇరగదీస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల వాయిదా పడుతుంటే.. ఈ మూవీ పాటలకు మాత్రం క్రేజ్ రోజురోజుకీ పెరిగిపోతోంది.

rrr-natu-natu-song-rrr-movie-natu-natu-song-dance-video-viral-from-america

Advertisement

తాజాగా అమెరికాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరన్ కలిసి స్టెప్పులేసిన నాటు నాటు పాటకు టెడ్డీతో ఓ కుర్రాడు స్టెప్పులేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా సరే.. నాటు నాటు పాట వినిపిస్తే చాలు.. తెలియకుండానే కాలు కదపాల్సిందే.. అంత క్రేజ్ వచ్చింది ఈ పాటకు.. అమెరికాలో కుర్రాడు.. టెడ్డీతో కలిసి ఈ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో చక్కర్లు కొడుతోంది.

అయితే ఈ వీడియోను Naatufied in USA అనే పేరుతో షేర్ చేశారు.. ఇప్పుడా వీడియో నెట్టింట్లో దుమ్మురేపుతోంది. జనవరి 7 నుంచి RRR Movie వాయిదా పడుతూ వస్తోంది. మార్చి 18 లేదా ఏప్రిల్ 28న RRR మూవీని రిలీజ్ చేసేందుకు మూవీ టీం రెడీ అవుతోంది. వైరల్ అవుతున్న అమెరికాలో నాటు డ్యాన్స్ వీడియో మీరూ ఓసారి చూడండి…

Advertisement


Read Also : Morning Wakeup Tips : ఉద‌యం నిద్ర లేచిన వెంట‌నే వీటిని చూస్తే రోజంతా శుభ‌మే జ‌రుగుతుందని తెలుసా !

Advertisement