Turmeric remedy: పసుపు మంచి ఆహార పదార్థమే కాదు.. దాని వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పసుపు మంచి యాంటిబెటిక్ గా పని చేస్తుంది. ఏదైన గాయాలు అయినా అక్కడ పసుపు పెట్టుకుంటే యాంటిబెటిక్ గా పని చేసి, దానిని త్వరగా నయం చేస్తుంది. ఆహారం నుండి ఆరోగ్యం వరకు పసుపుకు ఉన్న ప్రత్యేక అంతా ఇంతా కాదు.
పసుపు ప్రతి ఇంట్లోనూ కనిపించే ఒక ముఖ్యమైన వస్తువు. అన్నింటి కంటే ముఖ్యమైనది ఏమిటంటే.. ఔషధ గుణాలు ఉండే ఆహార పదార్థం. పసుపును ఆర్థిక దోశాల నివారణకు కూడా వాడవచ్చని పలువురు చెబుతున్నారు. గ్రహ దోషాల వల్ల ఇబ్బంది పడుతుంటే కొన్ని పసుపు కొమ్ములతో దానిని దూరం చేసుకోవచ్చుద. ఇలా చేసే నివారణలు చాలా ప్రయోజనం చేకూరుస్తాయి. హిందూ మతంలో పసుపు విష్ణువు, బృహస్పతి గ్రహానికి సంబంధించిందని నమ్ముతారు. విష్ణువు, బృహస్పతి సంతోషంగా ఉంటే, జీవితంలో శుభ ఫలితాలు ఉంటాయి. గురువారం పసుపుతో కొన్ని ప్రత్యేక నివారణలను ప్రయత్నించండి. గురువారం పసుపు రేఖను గీస్తే ప్రయోజనం ఉంటుంది. జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉన్న వారు విష్ణువును, బృహస్పతిని పూజించాలని అంటారు పండితులు. ఇలా పసుపుతో పూజించిన అనంతరం మణికట్టు మెడపై పసుపుతో గీత గీయాలి. ఇలా చేస్తే గురు గ్రహం ప్రభావం చూపిస్తుంది. ఇలా బలం చేకూరుతుంది.