...

Kodipunju: కోడిపుంజుకి దశదినకర్మలంట.. 500మందికి భోజనాలంట.. దానిని గుర్తుచేసుకుంటూ ఏడుపే ఏడుపు

Kodipunju: కొంతమందికి తమ పెంపుడు జంతువులు అంటే ఎనలేని ఇష్టం ఉంటుంది. వాటిని చాలా ప్రేమిస్తారు. ఇంట్లో సభ్యులుగానే చూస్తారు. వాటిని అల్లారుముద్దుగా పెంచుకుంటారు. ఎక్కడికి వెళ్లినా వాటిని కూడా తీసుకువెళ్తారు. అవి దూరం అయితే అస్సలే తట్టుకోలేరు. కుటుంబసభ్యుడిని కోల్పోయినట్లుగా కన్నీరు మున్నీరు అవుతుంటారు. కొందరైతే డిప్రెషన్ లోకి వెళ్లిపోతారు. కానీ మనుషులు చనిపోతే చేసినట్లు అంత్యక్రియలు, దశదినకర్మలు చేయడం.. అందర్నీ పిలిచి భోజనాలు పెట్టడం గురించి ఎక్కడా విని ఉండారు.

Advertisement


అలాంటి ఓ వింత ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. యూపీలోని ఓ కుటుంబం కోడి పుంజును పెంచుకునేది. కానీ అది చనిపోయింది. ఏదో రోగం వచ్చి, లేదా పిల్లి లాంటి జంతువు కరవడం వల్లో చనిపోలేదు ఆ కోడిపుంజు. ప్రాణాలకు తెగించి చేసిన పోరాటంలో అసువులు బాసింది. ఆ కుటుంబం కోడి పుంజుతో పాటు మరో గొర్రె పిల్లనూ పెంచుకుంటున్నారు. అయితే ఆ గొర్రె పిల్పై వీధి కుక్కలు దాడి చేశాయి. వాటి నుండి ఆ గొర్రె పిల్లను కాపాడేందుకు ఆ కోడిపుంజు వీధి కుక్కలను ఎదురించింది. వాటిని పొడుస్తూ అక్కడి నుండి తరిమేసింది. కానీ కోడి పుంజుకూ తీవ్ర గాయాలు కావడంతో అది చనిపోయింది. ఇంట్లోని మనిషిలా పెంచుకున్న కోడి పుంజు.. అలా గొర్రె పిల్లను కాపాడే క్రమంలో చనిపోవడంతో ఆ కుటుంబం తట్టుకోలేక పోయింది. అలా చనిపోయిన కోడిపుంజును మామూలుగా పంపించవద్దని ఆ కుటుంబం అంత్యక్రియలు నిర్వహించారు. దానితో పాటు మిగతా తతంగాలూ చేసింది. 500 మందిని పిలిచి భోజనాలు పెట్టించారు ఆ కుటుంబ సభ్యులు.

Advertisement

 

Advertisement
Advertisement