Ravinder, mahalaxmi: కోలీవుడ్ ప్రముఖ నిర్మమాత రవీందర్ ను బుల్లితెర నటి వివాహం చేసుకొని అందరికీ ఆశ్చర్యం కల్గించిన విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే పెళ్లైన రోజు దగ్గర నుంచి వీరి జంట హాట్ టాపిక్ గా మారుతుంది ముఖ్యంగా వీరు సోషల్ మీడియాలో ఏం చేసినా సరే వైరల్ అవుతుంటారు. ఇటీవలే సెప్టెంబర్ ఒకటవ తేదీన మహాలక్ష్మి ఘనంగా పుట్టి రోజు జరుపుకుంది. వీరిద్దరూ హనీమూన్ కు వెళ్లిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేయగా విపరీతమైన ట్రోలింగ్ కు గురయ్యారు. దీంతో మహాలక్ష్మి దయచేసి తన భర్తను అవమానించవద్దు అంటూ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ కూడా పెట్టింది.
అయితే రవీందర్ తన భార్య మహాలక్ష్మికి రవీందర్ కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. అదేంటంటే.. పెళ్లి వల్ల సందర్భంగా రవీందర్ ఇచ్చిన కానుకలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే మహాలక్ష్మిపై ప్రమతో రవీందర్ భారీ కానుకలను ఇచ్చారట. అంతేకాదు బంగారు పూత పూసిన మంచాన్ని కూడా బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. ఇక అంతే కాదు మంచానికే బంగారు పూత పూయించి ఇచ్చిన రవీందర్ ఇంకా చాలానే ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే దాదాపు కిలోన్నర బంగారం బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. మరి ఇందులో నిజం ఎంత ఉందనేది మాత్రం ఎవరికీ తెలియదు.