Rakul Preeth singh: ప్రేమించినవాడితోనే రకుల్ ప్రీత్ పెళ్లి, ఎప్పుడంటే?

Rakul preeth singh marriage with her boy friend
Rakul preeth singh marriage with her boy friend

Rakul Preeth singh: స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ గురింతి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరం లేదు. అయితే త్వరలోనే ఆమె తన ప్రియుడితో పెళ్లి చేస్కోబోతుందట. అంతే కాదండోయ్ తెలుగులో ఎందుకు ఇంత గ్యాప్ వచ్చిందో కూడా తెలిపింది. అయితే ఈమధ్య కాలంలో తాను తెలుగు సినిమాల్లో నటించలేదని తనకు కూడా తెలుసని… త్వరలోనే తప్పకుండా టాలీవుడ్ లో నటిస్తానని వివరించింది. అలాగే నేను ఎప్పటికీ తెలుగు ప్రేక్షకులను ప్రేమిస్తూనే ఉంటానని వివరించింది.

Advertisement

అయితే బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో రకుల్ ప్రేమలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరూ అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ రకుల్ తమ్ముడు అమన్ ప్రీత్ చెప్పినట్లు ఓ ఇంగ్లీషు పత్రికలో వార్తలు వచ్చాయి.

దానిపై స్పందిస్తూ… అమన్.. నా పెళ్లిపై నువ్వు నిజంగానే క్లారిటీ ఇచ్చావా.. నా పెళ్లి గురించి నాక్కూడా చెప్పాలి కదా బ్రో. నా జీవితం గురించి నాకే తెలియకపోవడం హాస్యాస్పదంగా ఉందని అని ట్వీట్ చేశారు. కాగా రకుల్ ప్రస్తుతం డాక్టర్ జీ, థ్యాంక్ గాడ్, ఛత్రివాలి, ఇండియన్-2 సినిమాల్లో నటిస్తున్నారు.

Advertisement