Viral Video: వామ్మో… ఆవు దూడను అమాంతం పట్టేసిన కొండచిలువ… వీడియో చూస్తే ఒళ్ళు జలదరించడం ఖాయం!

Viral Video: సాధారణంగా పాము పేరు వినిపించగానే చాలామంది ఆమడ దూరం పరిగెత్తారు. పాము చిన్నదైనా పెద్దదైనా చాలామందిలో భయం అనేది ఉంటుంది. చిన్న పాముకే ఈ స్థాయిలో భయపడేవారు కొండచిలువ పేరు వింటే దరిదాపుల్లోకి కూడా రారు. ఒక్కసారిగా కొండచిలువ చేతికి చిక్కామంటే ఇక మన ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. అయితే తరచూ కొండచిలువ పలు రకాల జంతువులు మనుషుల పై దాడి చేస్తున్న ఘటనల గురించి మనం ఎన్నో విన్నాం.ఇక ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ వీడియోలో భాగంగా కొన్ని ఆవు దూడలు కలిసి గడ్డి మేస్తున్న సమయంలో ఏకంగా పది అడుగుల పొడవు గల కొండచిలువ అక్కడికి రావడంతో ఆవు దూడలన్ని పరుగులు పెట్టాయి. కానీ కొండచిలువ మాత్రం ఒక ఆవు దూడ కాలును గట్టిగా పట్టుకుంది. ఈ విధంగా కొండచిలువ పట్టుకున్నప్పటికీ ఆవు దూడ ప్రాణాలపై ఆశలు పెట్టుకుని పరుగులు తీస్తూ గట్టిగా కేకలు వేస్తోంది.

Advertisement

 

View this post on Instagram

 

Advertisement

A post shared by Wildlifeanimall (@wildlifeanimall)

Advertisement

కొండచిలువ నుంచి తప్పించుకొని ప్రాణాలను కాపాడుకోవాలని ఆవు దూడ ఎంతో ప్రయత్నిస్తున్నప్పటికీ కొండచిలువ మాత్రం పట్టు వదలకుండా పట్టుకుంది. అయితే ఆవు దూడ మాత్రం నొప్పిని భరిస్తూ ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగు తీస్తుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆ కొండచిలువ నుంచి ఆవు దూడ తన ప్రాణాలను కాపాడుకుందా? లేక కొండచిలువకు బలై పోయిందా అనే విషయం తెలియడం లేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement