Intinti Gruhalakshmi Serial Sept 30 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ఇరుగు పొరుగువారు అన్న మాటలకు అనసూయ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో లాస్య తులసిని చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది.
మరొకవైపు తులసి అక్కడ పనిచేసే ఒక ఆమెను పిలిచి నాకు అందులో ఏముందో చూసి చెప్పు నేను అగ్రిమెంట్ సంతకం చేస్తాను అనడంతో ఆమె వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అది చూసిన లాస్య మరింత కోపంతో రగిలిపోతూ ఒకప్పుడు అందరికీ సేవలు చేసే తులసి ఈరోజు అందరితో సేవలు చేయించుకుంటుంది ఇదంతా సామ్రాట్ గారి మహత్యం అంటూ రన్నింగ్ కామెంట్స్ చేస్తూ ఉంటుంది.
అప్పుడు నందు అవన్నీ మనకు ఎందుకు లాస్య మన పని మనం చేసుకుందాము అనటంతో, నీ వల్ల కాదు ఎలాగో అలాగా ఏదో ఒకటి చేసి తులసిని తిట్టించాలి అని అనుకుంటుంది లాస్య. ఇంతలోనే తులసి అక్కడికి వచ్చి ఏమైంది లాస్య నేను ఇచ్చిన ఫైల్ రెడీ చేసావా లేదా అని అడగగా నేను కొంచెం బిజీగా ఉన్నాను వేరే వర్క్ చేస్తున్నాను అని లాస్య అనటంతో అవును నువ్వు ఎంత బిజీగా ఉన్నావో గత పావుగంట నుంచి కనిపిస్తూనే ఉంది నచ్చితే చెయ్ లేకపోతే ఇంకొకరికి ఇస్తాను.
మధ్యాహ్నం లోగా నాకు ఫైల్ కావాలి అడిగించుకోవద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తులసి. మరొకవైపు ప్రేమ్ గిటార్ వాయిస్తూ ఉండగా ఇంతలో శృతి అక్కడికి వస్తుంది. అప్పుడు వారిద్దరూ కలిసి సరదాగా పోట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు అనసూయ ఒకతే బట్టలు ఆరేసుకుంటూ తిట్టుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి అభి వస్తాడు.
Intinti Gruhalakshmi Serial సెప్టెంబర్ 30 ఎపిసోడ్ : అనసూయను రెచ్చగొట్టిన అభి.. తులసిని అడ్డుకునేందుకు ప్లాన్
అప్పుడు అభి అనసూయకు లేనిపోని మాటలు అని చెప్పి అనసూయను మరింత రెచ్చగొడతాడు. అప్పుడు వారిద్దరూ కలిసి ఎలా అయినా తులసిని జాబ్ కి వెళ్లకుండా ఆపేలా చేయాలి అని అనుకుంటారు. ఆ తర్వాత తులసి సామ్రాట్ కి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు మీటింగ్ కి టైం అవుతుంది అని అంటుంది. అప్పుడు సామ్రాట్, సారి తులసి గారు ఈరోజు కొంచెం లేట్ అయింది ఎలాగో అలాగా మేనేజ్ చేయండి అనడంతో అప్పుడు కాసేపు వారిద్దరు నవ్వుకుంటూ ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉంటారు.
ఆ తర్వాత ఫోన్ కట్ చేయక ఇంతలో అక్కడికి సామ్రాట్ వాళ్ళ బాబాయ్ వస్తాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి బయటికి వెళ్లక అక్కడ హాని స్కూల్ కి వెళ్ళను ఈరోజు నా పుట్టినరోజు కదా నాన్న అని అంటుంది. అప్పుడు సామ్రాట్ నాకు కూడా నిన్ను పంపించాలని లేదు కానీ మీ స్కూల్ మేడం ఫోన్ చేసి ఎగ్జామ్ ఉంది అని చెప్పింది అని అంటాడు. ఇంతలోనే సామ్రాట్ ఆఫీస్ కి బయలుదేరుతూ ఉండగా అక్కడికి అనసూయ వస్తుంది.
అప్పుడు అనసూయ మీతో కొంచెం మాట్లాడాలి అని లోపలికి పిలుచుకొని వెళ్లి ఇకపై మా తులసి మీ ఆఫీసుకు రాదు మీరే తులసిని దూరంగా ఉంచండి మీకు మీరుగా తులసినీ ఆఫీస్ కు రాకుండా చేయండి అని బ్రతిమలాడి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ప్రేమ్ ఆడిషన్స్ ఇచ్చి బయట వెయిట్ చేస్తూ ఉండగా ఇంతలోనే ప్రేమంటే మీరేనా మీరు ఆడిషన్స్ కి సెలెక్ట్ అయ్యారు అని చెప్పడంతో ప్రేమ్ సంతోషపడుతూ ఉంటాడు. లోపలికి వెళ్తూ ఉండగా ఒక అతను టాలెంట్ ఉన్నది నాకు కానీ అడ్డు దావలో రికమండేషన్లతో వచ్చింది నువ్వు అని ప్రేమతో గొడవ పెట్టుకుంటాడు.