...

Viral Video: ఇతడు మనీషా? లేక రోబో నా? ఇతని పనితనం చూస్తే మీరూ కూడ షాక్ అవుతారు..!

Viral Video: ప్రస్తుత కాలంలో మనుషులు శారీరక శ్రమ తగ్గించి తమ మెదడుకు పని పెడుతున్నారు. ఏ పని చేయాలన్నా కూడా శారీరకంగా కష్టపడకుండా యంత్రాల సహాయంతో చాలా సులభంగా అతి తక్కువ సమయంలో అన్ని పనులు పూర్తి చేస్తున్నారు. పంట పొలాల్లో వ్యవసాయం చేసే దగ్గర నుండి ఎటువంటి ఇంట్లో చిన్నచిన్న పనులు చేసే వరకు అన్ని పనులు మిషన్స్ సహాయంతోనే చేస్తున్నారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఉద్యోగం చేయటంతో ఇంటి పనులు సులభంగా చేయడానికి యంత్రాలను వినియోగిస్తున్నారు. ఇటువంటి ఈ యంత్రాల యుగంలో ఒక మనిషి పనితీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఉన్న ఒక వ్యక్తి పనితీరు చూసి అందరూ అతడు మనీషా లేక? రోబోనా అని షాక్ అవుతున్నారు. ఆ వీడియోలో కొందరు వ్యక్తులు పొలంలో పండిన క్యాబేజీ లను మార్కెట్ కి తరలించడానికి ఒక చోట కుప్ప పోశారు. కానీ క్యాబేజీ కి పెద్దపెద్ద ఆకులు కాండం ఉండటంవల్ల బస్తాలలో నింపేందుకు కష్టంగా మారింది. అందువల్ల వాటికి ఉన్న ఆకులు కాండం తొలగించి బస్తాలలో నింపుతున్నారు. అయితే ఒక వ్యక్తి కింద కూర్చొని క్యాబేజి ఆకులు కాండం చకచకా తొలగిస్తూ అక్కడే నిల్చుని ఉన్న మరొక వ్యక్తికి విసురుతున్నాడు.

 

ఆ సదరు వ్యక్తి పనితనం చూస్తే అతని చేతిలో ఏమైనా కనిపించినీ యంత్రాలు దాగి ఉన్నాయా అని అనుమానం వస్తుంది. అంత వేగంగా ఆ వ్యక్తి క్యాబేజీ ఆకులు, కాండం తొలగిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషియల్ మీడియాలో వైరల్ గా మారింది. ట్విట్టర్ వేదికగా ఒక వ్యక్తి ఈ వీడియో షేర్ చేస్తూ ఇలాంటి వ్యక్తులు ఉండగా.. భారత దేశానికి రోబోల అవసరం ఉండదు అని రాసుకొచ్చడు. ఈ వీడియో చుసిన నెటిజన్లు కూడ ఆ వ్యక్తి పనితనాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.