Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Oo antava mava: ఊ అంటావా మావా సాంగ్ క్రేజ్ మామూలుగా లేదుగా.. అమెరిక్ వీధుల్లో కూడా అదే పాట

Oo antava mava : సుకుమార్, బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప ఎంత పెద్ద హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. విడుదలైన మొదట్లో కొంత నెగెటివ్ స్ప్రెడ్ చేసినా.. తర

By Vinod Kumar

Published on: May 28, 2022 11:00 AM

Updated on: May 28, 2022 4:19 PM

Oo antava mava

---Advertisement---

Oo antava mava : సుకుమార్, బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప ఎంత పెద్ద హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. విడుదలైన మొదట్లో కొంత నెగెటివ్ స్ప్రెడ్ చేసినా.. తర్వాత్తర్వాత సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది. చూసిన ప్రతి ఒక్కరూ పుష్ప ఓ రేంజ్ లో ఉందని చెప్పారు. ఈ సినిమా లాగే అందులోని ఊ అంటావా పాట కూడా అదే రేంజ్ లో హిట్ అయింది. ఎక్కడ విన్నా అదే సాంగ్ మార్మోగింది. ఈ పాటలో సమంత అందచందాలు కుర్రకారును పిచ్చెక్కించాయి. ఊ అంటావా మావా.. ఊహూ అంటావా మావా.. అని చాలా మంది హమ్ చేయడం మొదలు పెట్టారు.

Oo antava mava
Oo antava mava

 

Advertisement

తాజాగా అమెరికాలో ఓ 13 ఏళ్ల చిన్నారి వయోలిన్ వాయిస్తూ ఊ అంటావా మావా.. ఊహూ అంటావా మావా అంటూ కాలిఫోర్నియా వీధుల్లో సందడి చేసింది. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పుష్ప సినిమా విడుదలై చాలా రోజులే అయిప్పటికీ ఇంకా పుష్ప క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ అమ్మాయి శ్రీవల్లి పాటకు సంబంధించిన మ్యూజిక్ ను వయోలిన్ మీద వాయించి, అందరినీ షాక్ కు గురి అయ్యేలా చేసింది.

ఈ అమెరికన్ పాప వాయించి ఈ పాట ఇప్పుడు వైరల్ గా మారింది. 13 ఏళ్ల వయోలిన్ విద్యాంసురాలికి యూట్యూబ్ లో 6 మిలియన్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు.

Read Also :

Advertisement

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :