...

Viral video: చిరు పాటకి తాత డ్యాన్స్.. ఇప్పుడే ఇలా ఉన్నాడంటే.. అప్పట్లో ఎలా ఉండేవాడో మరి!

Viral video: ఈరోజుల్లో చాలా మందిలో ఉన్న టాలెంట్ ను సోషల్ మీడియా వెలుగులోకి తీసుకొస్తుంది. వేల మందికి వారి డ్యాన్స్, పాటలు, జోకులు, వంటలు… ఇలా అన్నింటిని పరిచయం చేస్తుంది. అయితే చిన్న చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు తమ స్టైల్ లో స్టెప్పులు వేస్తూ అందరికీ ఆశ్చర్యం కల్గిస్తున్నారు. అంతే ప్రజలకు నచ్చేలా వీడియోలు చేస్తూ వేలు, లక్షల్లో డబ్బులు కూడా సంపాదిస్తు్ననారు. వీలైనంత ఎక్కువ మంది ఫాలోవర్స్ ను పెంటుకుంటున్నారు.

అయితే తాజాగా ఓ తాత చిరు పాటకు డ్యాన్స్ వేశాడు. అదరిపోయే స్టెప్పులతో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అతడు డ్యాన్స్ చేస్తుండగా చూసిన ఓ వ్యక్తి దాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఇంకేముందు తాత డ్యాన్స్ అదిరిపోవడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెట్టింటినే షేక్ చేస్తూ దూసుకుపోతోంది. అతని ఎనర్జీ, అతని స్లెప్పులు వేరే లెవెల్ లో ఉన్నాయి. మీరూ ఓ సారి తాత డ్యాన్స్ పై లుక్కేయండి.

https://youtu.be/ozgRcatXE5U