Nuvvu Nenu Prema July 18 Today Episode : నువ్వు నేను ప్రేమ సీరియల్… గుడిలో పద్మావతి వ్రతాన్ని చెడగొట్టిన విక్రమ్.. విక్రమ్‌కు చివాట్లు పెట్టిన పద్మావతి..

Nuvvu Nenu Prema July 18 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమయ్యే నువ్వు లేక నేను సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకెళ్లి పోతుంది. ఈరోజు ఎపిసోడ్ భాగంగా ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో పద్మావతి, అను గోరింటాకు పెట్టుకుంటారు. ఉదయం లేవగానే గోరింటాకు ఎవరిది బాగా ఎర్రగా పండింది అని అత్త అడుగుతుంది. అప్పుడు వాళ్ల అత్త అను చేతులు ఎర్రగా పండాయి అంటుంది. పద్మావతి నాది కూడా బాగా పండింది అంటుంది. పద్మావతి వాళ్ల అత్త గొడవ పడతారు. అంతలో అక్కడికి మురళి వస్తాడు.

Nuvvu Nenu Prema July 18 Today Episode

ఏంటండీ గొడవ అంటాడు. అప్పుడు పద్మావతి చూడండి మురళి మా ఇద్దరు చేతులు ఎర్రగా పండిందా అని చెప్పమంటే మా అత్త నాది సరిగ్గా పండలేదు అంటుంది. అప్పుడు మురళి.. పద్మావతి చేతులు ఎర్రగా కొంచెం పండినాయి అంటాడు. అంటే.. పద్మావతికి మంచి మొగుడు వస్తాడు అనమాట.. పద్మావతి మా అక్కకు కూడా మంచి మొగుడు వస్తాడు అంటుంది. అప్పుడు అత్త సరేగాని గుడికి పోవాలా.. తొందరగా రెడీ అవ్వు పోండి. అంటుంది అను.. బాబు నువ్వు కూడా గుడికి పోవాలి కదా రెడీ అయ్యి రా పోండి అంటుంది అత్త.. అప్పుడు మురళి మీతో నేను ఒక విషయం చెప్పడానికి వచ్చాను అని అంటాడు.

Advertisement

ఒక కేసు పని మీద బయటకు వెళ్లాల్సి ఉంది. రావడానికి లేట్ అవుతుంని చెబుతాడు. అప్పుడు వాళ్ళ అత్త అదేంటి బాబు మీరు ఉన్నారనే ధైర్యంతో వాళ్లను గుడికి పంపిస్తున్నాను. నిజమే పిన్ని.. కానీ చాలా అర్జెంటుగా వర్క్ ప్లీజ్ బయటికి వెళ్లాలని మురళి చెబతాడు. అప్పుడు పద్మావతి పోనీలే అత్త.. చాలా అర్జెంట్ వర్క్ అంటున్నాడు కదా. నేను అక్క గుడికెళ్లి వస్తాము అంటుంది పద్మావతి. అత్త మేము వెళ్లి వస్తామని అను అంటుంది. అత్త సరే వెళ్లి రెడీ అవ్వండి అనడంతో.. బాబు మీ వర్క్ తొందరగా అయితే తొందరగా రా బాబు అని అంటుంది.

పిన్ని పిన్ని.. మనం గుడికి వెళ్ళాలి కదా టైం అయిందా అంటుంది అరవింద. అప్పుడు వాళ్ల పిన్ని మనం రావడానికి లేట్ అవుతుంది కదా.. మళ్లీ మేకప్ వేసుకొని వస్తున్నానని చెబుతుంది. అప్పుడు వాళ్ళ అత్త వెళ్ళేది గుడికే కదా పార్టీ కాదు కదా.. మేకప్ మీద ఉన్న శ్రద్ధ దేవుడి మీద కూడా ఉండాలని అంటారు. పిన్ని పోదావమని అరవింద అంటుండగానే.. విక్రమాదిత్య, ఆర్య మేము కూడా వస్తాం అంటారు. ఎప్పుడు సూటు బూటు వేసుకున్న ఇద్దరూ సాంప్రదాయమైన వస్తువులు వేసుకున్నారు ఏదైనా విశేషమాని వాళ్ల నాయనమ్మ అంటుంది. మేము కూడా గుడికి వస్తున్నామని ఆర్య అంటాడు.

Advertisement
Nuvvu Nenu Prema July 18 Today Episode

విక్కీ నువ్వు కూడా వస్తున్నావాని అరవింద అంటుంది. అవును.. అక్క నేను కూడా నీతో కలిసి గుడికి వస్తానని అనడంతో విక్కీ వాళ్ల నాయనమ్మ చాలా మంచిది అంటుంది. నమ్మలేకపోతున్నాను.. ఎప్పుడు ఆఫీస్ అని అంటావు కదా.. దేవుడు గురించి తలవని నువ్వు.. గుడికి వస్తావా అంటుంది అరవింద. కానీ ఈ మార్పు ఎవరికోసం.. దేవుడు కోసం కాదు అక్క.. దేవుడు కంటే నేనెంతో అభిమానించే అక్క కోసం గుడికి వెళ్తానని అంటాడు. అక్కకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని వికీ చెబుతాడు. నీకోసం వస్తున్నాఅక్క అనడంతో ఇలాంటి తమ్ముళ్లు దొరకటం నా అదృష్టమని అరవింద ఆనందపడుతుంది. నిన్ను ఇంత బాగా చూసుకుంటున్న మీ తమ్ముళ్లకు మంచిగా చూసుకునే భార్యలు రావాలని మనస్పూర్తిగా ఆ దేవున్ని కోరుకో తల్లిని వాళ్ల నాయనమ్మ అంటుంది. అలాగే నాయనమ్మ.. గుడికి వెళ్తాస్తామని చెప్పి అరవింద బయలుదేరుతుంది.

మరోవైపు.. గుడికి వెళ్లడానికి రెడీ అవుతున్న పద్మావతి.. అక్క ఎంతో అందంగా ఉన్నావు సినిమా హీరోయిన్‌లా ఉన్నావని అంటుంది. అక్కడికి వాళ్ళ అత్త వస్తుంది.. చూడముచ్చటగా ఉన్నారు అంటుంది. నా దిష్టి తగిలేలా ఉందంటూ ఇద్దరికి దిష్టి చుక్కలు పెడుతుంది. మీరు గుడికి వెళ్తున్నారు కదా అక్కడ చెట్టుకు ముడుపులు కట్టండని చెబుతుంది. వచ్చే ఏడాది కల్లా మీ ఇద్దరి పెళ్లిళ్లు జరగాలని కోరుకోండని వాళ్ల అత్త అంటుంది. ఆ తరవాత గుడిలోకి వెళ్లి పూజ చేసుకొని రండి.. అర్థమైందా అని అత్త అంటుంది. అప్పుడు పద్మావతి, అను సరే అత్త అంటారు.

Advertisement

పద్మావతి అక్క అరవింద మనల్ని పిలిచారు కదా.. అక్కడికి వెళ్దాం అక్క అని పద్మావతి అంటే.. అను ఎందుకు అమ్మి అంటుంది. అరవింద చాలా మంచిది అని పద్మావతి చెబుతుంది. అక్కడికి వెళ్లకపోతే.. అరవింద బాధపడతారు కదా అక్క అని అంటుంది. మనం ఆ గుడికి వెళ్దాం అక్క.. అరవింద పూజకు పోయినట్టు ఉంటుంది అక్క అని చెబుతుంది. అప్పుడు అను అక్కడికి టెంపర్ వస్తాడేమో… అప్పుడు పద్మావతి అంత సీన్ ఏమీ లేదు.. ఆఫీసులో దేవుడి దగ్గర దీపం పెడితేనే నన్ను అరిచాడు అలాంటోడు గుడికి వస్తాడా అంటుంది పద్మావతి.. టెంపరోడు గుడికి రాడనే ధైర్యంతోనే చెబుతున్నాను అక్క పోదాం పదా అంటుంది. అత్తకు తెలిస్తే కోపడతదని అను అంటుంది.

Nuvvu Nenu Prema July 18 Today Episode : అరవింద పిలిచిందని గుడికి వెళ్లిన పద్మావతి.. విక్రమ్ చూసి ఏం చేస్తాడంటే?

ఏమి చెప్పనులే అక్క రా.. అంటుంది. అంతలో అరవింద, విక్రమాదిత్య, ఆర్య గుడికి వస్తారు. ఇంత మంచిగా చూసుకునే తమ్ముళ్లు.. నా రెండు కళ్ళు అంటుంది అరవింద. అప్పుడు విక్కీ నువ్వు నా ప్రాణం అక్క అంటాడు. మీరు ఇలాగే ఉండాలని అంటుంది అరవింద. అప్పుడు వాళ్ళ పిన్ని హలో.. హాయ్ హాయ్ బాయ్.. బాయ్ మీ ప్రేమలు తరవాత.. ఇక్కడ చాలా రష్ గా ఉన్నట్లు ఉంది. నావల్ల కాదు.. అరవింద పూజకు వస్తువులు కావలసిన తీసుకురాని అంటుంది. అమ్మ అక్కని ఎందుకు ఇబ్బంది పెట్టడం నువ్వు తీసుకురా అంటాడు ఆర్య.

Advertisement
Nuvvu Nenu Prema July 18 Today Episode

ఇంతమంది ఉన్న జనాల్లోకి నేను వెళ్ళనని అంటుంది పిన్ని.. మీరేమీ టెన్షన్ పడకండి.. నేను వెళ్లి తీసుకొస్తాని అంటుంది. అప్పుడు వికీ మేము వెళ్ళి తీసుకు వస్తానలే అంటాడు. అరవింద వద్దులే అంటది. అక్క నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటానని చెబుతారు. అక్కని తీసుకొని గుడిలోకి వెళ్లు ఆర్య అంటాడు. పూజకు కావలిసినవన్నీ నేను తెస్తాను అంటాడు విక్కీ. అప్పుడు వెంటనే రక్షాలు కూడా తీసుకొనిరా విక్కీ.. మీ బావకు కట్టాలని అంటుంది అరవింద.. బావ కోసం అన్నావు కదా తప్పకుండా తీసుకొస్తానని వికీ అంటాడు.

ఈ సంవత్సరం మీ బావ అలాగే మీ పెళ్లి అయ్యి వచ్చే సంవత్సరం మీ భార్యలతో కలిసి రావాలి అంటుంది అరవింద. వెరీ గుడ్ అరవింద.. వచ్చే కోడలని చూడాలని ఆశగా ఉందని అంటుంది. ఎప్పుడొస్తారు ఎక్కడున్నారోని పిన్ని అంటుంది. నువ్వు వెళ్లి తీసుకొనిరా అని విక్కీ అంటాడు. అంతలోనే పద్మావతి గుడిలోకి ఎంట్రీ ఇస్తుంది. మొదటిసారిసారి ఉపవాసం ఉంటున్నాను.. శ్రీనివాస ఏ ఆటంకాలు లేకుండా నువ్వే చూసుకోవాలని అంటుంది పద్మావతి.. అక్కడ బజ్జీల వాసన వస్తుంది.. అక్క నేను ఉపవాసం ఉండలేను.. ఒక ప్లేటు తింటాను అని పద్మావతి అంటుంది. తప్పు.. అలా చేయకూడదు అమ్మ చెప్పిన మాట వినాలి కదా.. వ్రతం నిష్ఠగా చేయాలని అను చెబుతుంది. మనకు మంచి మొగుళ్లు వస్తారని అంతా మంచే జరుగుతుందని అంటుంది. ఇంతలోనే గుడికి వికీ వస్తాడు. ఇద్దరూ తెలియకుండానే ఒకరినొకరు ఎదురుపడతారు. చేతుల్లో కుంకుమ, పూలతో తీసుకెళ్లే ప్లేట్ పట్టుకుని వెళ్తుంటుంది పద్మావతి.

Advertisement

అప్పుడే వికీ కూడా వస్తాడు. ఇద్దరూ చూసుకోకుండానే ఒకరినొకరు తగులుతారు. అంతే.. చేతుల్లోని ప్లేట్ కిందపడిపోతుంది. అలా ఒకరినొకరు కలుస్తారు. ఆ తర్వాత పద్మావతి గుడి మెట్లు ఎక్కుతుంటుంది. ఆమె వెనుకాలే వికీ కూడా వెళ్తాడు. ఇంతలో పద్మావతి కళ్లు తిరిగినట్టుగా అనిపిస్తుంది. కిందపడిపోతుంటే వెంటనే తనను పట్టుకుంటాడు. పద్మావతికి నీళ్లు తాగిస్తాడు. అలా పద్మావతి వ్రతాన్ని విక్రమ్ చెడగొడతాడు. ఆ తర్వాత తేరుకున్న పద్మావతి విక్రమ్ ను చడామడా తిట్టేస్తుంది. తన వ్రతాన్ని చెడగొట్టావంటూ తిట్టిపోస్తుంది.. ఆ తర్వాత ఏమౌతుందో తెలియాలంటే ఇక రేపటి ఎపిసోడ్ లో జరగబోయే  చూడాల్సిందే..

Advertisement

Read Also : Nuvvu Nenu Prema July 15 Today Episode : నువ్వు నేను ప్రేమ సీరియల్.. విక్రమాధిత్య పద్మావతిని ప్రేమిస్తున్నాడా? ఆర్య ప్రయత్నం ఫలించిందా?

Advertisement
Tufan9 News

Recent Posts

Varahi Navaratri 2025 : వారాహి నవరాత్రులు.. ఎవరు చేయాలి.. ఎవరూ చేయకూడదు? తేలికైనా పూజా విధానం..!

Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…

1 week ago

Ashada Amavasya 2025 : ఆషాఢ అమావాస్య నాడు పూర్వీకులు భూమిపైకి వస్తారు.. ఈ రోజున కచ్చితంగా ఈ ఒక్క పని చేయండి..

Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…

1 week ago

Ashadha Amavasya : 2025 ఆషాఢ అమావాస్య ఎప్పుడు? ఏ తేదీన వస్తుంది? ప్రాముఖ్యత ఏంటి?

Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…

1 week ago

WI vs AUS Test : వెస్టిండీస్ vs ఆస్ట్రేలియా లైవ్.. టెస్ట్ సిరీస్‌ ఎప్పుడు, ఎక్కడ? భారత్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఎలా చూడాలి?

WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…

1 week ago

TG EDCET Result 2025 : తెలంగాణ EDCET 2025 రిజల్ట్స్ విడుదల.. ర్యాంక్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేయండి

TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…

1 week ago

Malabar Spinach : మలబార్ పాలకూర ఎప్పుడైనా తిన్నారా? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు!

Malabar Spinach : మలబార్ పాలకూర ఎప్పుడైనా తిన్నారా? ఈ పాలకూరనే బసెల్లా ఆల్బా, వైన్ పాలకూర, ఇండియన్ పాలకూర…

1 week ago

This website uses cookies.