Krishna Vamsi : టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు టాలీవుడ్ ఇండస్ట్రీకి గులాబీ, మురారి, అంతఃపురం సింధూరం ఖడ్గం వంటి ఎన్నో సూపర్ హిట్స్ అందించిన కృష్ణవంశీ గత కొంతకాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. ఈ మధ్యకాలంలో అతను దర్శకత్వం వహించిన సినిమాలు కొంతవరకు నిరాశపరిచాయి. కొంతకాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన కృష్ణవంశీ తాజాగా రంగమార్తాండ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మలయాళీ సినిమా ‘నట సామ్రాట్ ‘ కి రీమేక్ గా కృష్ణవంశీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
ఇదిలా ఉండగా కృష్ణవంశీ హీరోయిన్ రమ్యకృష్ణ అని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరికీ ఒక బాబు కూడా ఉన్నాడు. చాలా కాలం నుండి కృష్ణ వంశీ రమ్యకృష్ణ ఇద్దరు విడివిడిగా ఉంటున్నారని వారి వైవాహిక జీవితంలో కలహాలు వల్ల వారు విడిపోయారని వారి గురించి వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ విషయాల గురించి రమ్యకృష్ణ , కృష్ణవంశీ ఎక్కడ స్పందించలేదు. అయితే ఇటీవల రంగమాతను సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనేక ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న కృష్ణవంశీ తన సినిమాల గురించి మాత్రమే కాకుండా పర్సనల్ లైఫ్ గురించి కూడా ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఈ క్రమంలో రమ్యకృష్ణతో తన వైవాహిక జీవితం గురించి కూడా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణవంశీ మాట్లాడుతూ.. ఒకానొక సమయంలో నాకు సినిమాల పిచ్చి ఎక్కువగా ఉండటంవల్ల పెళ్లి గురించి ఆలోచన ఉండేది కాదు. కానీ అనూహ్యంగా రమ్యకృష్ణతో పెళ్లి జరిగిన తర్వాత కూడా నా జీవితంలో ఎటువంటి మార్పు లేదు. నేను ఎక్కువగా సినిమాల కోసమే నా సమయాన్ని కేటాయించే వాడిని. కానీ రమ్యకృష్ణ నన్ను చాలా బాగా అర్థం చేసుకుంది. మా గురించి వస్తున్న రొమాన్స్ విని మేమిద్దరం నవ్వుకునే వాళ్ళము అంటూ కృష్ణవంశీ వెల్లడించాడు. మా ఇద్దరి మధ్య ఉన్న బంధం గురించి మా ఇద్దరికీ మాత్రమే తెలుసు, మా గురించి తప్పుడు ప్రచారాలు చేయొద్దండి అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.
IRCTC Down : ప్రముఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)సైట్, యాప్ గురువారం (డిసెంబర్ 26)…
ICAI CA Final Result 2024 : ICAI CA ఫైనల్ రిజల్ట్స్ నవంబర్ 2024 లైవ్ అప్డేట్స్ :…
Earthquake AP : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భూమి కంపించింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారి…
Earthquake Nepal : మన పొరుగు దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌లో శనివారం ఉదయం 4.8 తీవ్రతతో…
Is Bank Open Today : ఈరోజు బ్యాంకులకు హాలిడే ఉందో లేదో తెలియదా? వారాంతాల్లో ఆర్థిక లావాదేవీలను పూర్తి…
Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్…
This website uses cookies.