Insta new features : ఇన్ స్టా గ్రామ్ యూజర్లకు ఆ సంస్థ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఫొటో షేరింగ్ ప్లాట్ ఫారమ్ ఇన్ స్టా గ్రామ్ యూజర్ల సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. రీల్స్ ను ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడం మరింత సులువు కానుంది. అంతే కాదండోయ్ వీడియో క్రియేటర్ల కోసం ఏకంగా మూడు కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఇన్ స్టా గ్రామ్ నుంచి ఫేస్ బుక్ కి క్రాస్ పోస్టింగ్ తో సహా రీల్స్ కు కొత్త ఫీచర్లు, అప్ డేట్ ను విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.
ముఖ్యంగా ఇన్ స్టా రీల్స్ కు వస్తున్న భారీ క్రేజ్ కారణఁగా ఇన్ స్టా నుంచి ఫేస్ బుక్ కు క్రాస్ పోస్టింగ్ చేస్కునే అవకాశాన్ని కల్పిస్తోంది. దీంతో పాటు పాపులర్ అయిన యాడ్ యువర్స్ స్టిక్కర్ ఫీచర్ ను రీల్స్ లోనూ తీసుకొచ్చేందుకు ప్రయ్తనాలు చేస్తోంది. ఇక మూడవదిగా ఎఫ్ బీలో రీల్స్ రీచ్, యావరేజ్ వ్యూస్ టైం, టోటల్ వ్యూస్ టైంను తెలుసుకునే అవకాశం కూడా యూజర్లకు కల్గనుది.
ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్ లో ఉన్న ఈ ఫీచర్లను త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకురాబోతుంది. మైక్రో బ్లాకింగ్ సైట్ ట్విట్టర్ లో ఫొటో షేరింగ్ ప్లాట్ ఫారమ్ హెచ్ అడమ్ మెస్సేరి కొత్త రీల్స్ అప్ డేట్స్ ను ప్రకటించారు.
Read ALSO : Whats app: అధిక ఫీచర్లు ఉన్నాయని “హే వాట్సాప్” వాడరంటే.. ఇక మీ పని అంతే!