Biggboss Revanth : రోజులు గడుస్తున్న కొద్దీ బిగ్ బాస్ మంచి వాడి వేడిగా సాగుతోంది. బిగ్ బాస్ హౌస్ లో మూడో వారం కెప్టెన్సీ టాస్క్ రంజుగా మారింది. తొలి రోజు టాస్క్ లో రేవంత్, శ్రీ హాన్ లు మిగతా కంటెస్టెంట్ ల కంటే ఎక్కువగా బొమ్మల్ని సేకరించారు. కెప్టెన్సీ పోటీదారుల రేస్ లో చాలా ముందుకు వచ్చారు. పోలీసులు కాపలా ఉండే అడవిలో నుండి వారికి తెలియకుండా బొమ్మల్ని దొంగలించాల్సి ఉంటుంది. ఈ గేమ్ ను దొంగలంతా ఒక బృందంగా ఏర్పడి వ్యూహాలు రచించి బొమ్మలు దొంగలించాల్సి ఉండగా.. దొంగలు మాత్రం వారిలో వారి దొంగ దెబ్బలు తీసుకుంటున్నారు. రేవంత్ సంపాదించిన బొమ్మల్ని నేహా, ఆరోహీలు దొంగ వ్యూహంతో స్కెచ్ వేసి దొంగలించారు. దీంతో రేవంత్ రివర్స్ గేమ్ ఆడటం మొదలు పెట్టాడు. దొంగగా ఉంటూనే పోలీసుల గెలుపు కోసం ఆడటం మొదలు పెట్టాడు.
బిగ్ బాస్ హౌస్ అంటే అల్లరి అల్లరిగా.. ఎప్పుడూ అలకలు, గొడవలు ఉంటాయి. కంటెస్టెంట్లు ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా.. లేని సమయంలో మరోలా ప్రవర్తిస్తుంటారు. అక్కడి మాటలు, ఇక్కడ.. ఇక్కడి మాటలు, అక్కడా చెబుతూ వారి మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. మోసాలు చేయడం, మోస పోవడం బిగ్ బాస్ హౌస్ లో సాధారణంగా జరిగే విషయం. వారితో పాటే ఉంటూ వారికే నష్టం చేస్తుంటారు. అదే బిగ్ బాస్ గేమ్ అంటే. బిగ్ బాస్ హౌస్ లోని వెళ్లి సైలెంట్ గా, తన పని తాను చేసుకుంటూ గేమ్ ఆడతానంటే కుదరదు. గొడవలు పెట్టుకునే వాళ్లే వారికి కావాలి.