Intinti Gruhalakshmi serial Oct 5 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో అనసూయ సామ్రాట్ తో మాట్లాడుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో నేను చెప్పిన మాటను ఎందుకు మీరు సీరియస్ గా తీసుకోవడం లేదు నాకు అర్థం కావడం లేదు మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే జీవితాంతం సమయం తీసుకుంటారు కాబట్టి పార్టీ అయ్యేలోపు మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి లేకపోతే నేనే రంగంలోకి దిగుతాను. అని సామ్రాట్ కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనసూయ.
ఇంతలోనే సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అక్కడికి వచ్చి ఎందుకు ఆవిడ అంత కోపంగా మాట్లాడుతోంది అని అడగగా ఏమీ లేదు అని అంటారు సామ్రాట్. మరొకవైపు నందు, లాస్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే ఒక అతను వచ్చి నందు జీవితం గురించి నందు లాస్యల గురించి నోటికొచ్చిన విధంగా వాడడంతో నందు కోపంతో రగిలిపోతూ ఉంటాడు.
అప్పుడు లాస్య నందు నీ పక్కకు పిలుచుకొని వెళ్తుంది. ఎందుకు లాస్య పక్కన పిలుచుకొని వచ్చావు వాడు చూసావా ఎలా వాగుతున్నాడో అని అనడంతో ఇప్పుడు మనం కూల్ గా ఉండాలి నందు గొడవలు పెట్టుకోకూడదు అని అనడంతో వెంటనే అవి అక్కడికి వచ్చి ఆంటీ చెప్పింది కరెక్టే డాడ్ అని అంటాడు. నానమ్మ కూడా అమ్మ విషయంలో చాలా సీరియస్ గా ఉంది అని అనటంతో సామ్రాట్ అభిమానులను నమ్మడు.
ఆ తర్వాత అభి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు హనీనీ తులసి రెడీ చేయడంతో సామ్రాట్ అక్కడికి వచ్చి హని ని చూసి మురిసిపోతూ ఉంటాడు. అప్పుడు హాని పిల్లలు రావడంతో వారితో కలసి అక్కడ నుంచి వెళ్లిపోగా వెంటనే తులసి సామ్రాట్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు తులసి ఎందుకు మీరు అలా ప్రవర్తిస్తున్నారు అని అనడంతో సామ్రాట్ తులసికి అబద్ధం చెబుతూ ఉంటాడు.
రోజురోజుకీ హనీ మీకు దగ్గర అవుతుంది ఆ స్వార్థంతోనే ఇలా చేస్తున్నాను తులసి గారు అని అబద్ధం చెప్పి తప్పించుకుంటాడు సామ్రాట్. ఆ తర్వాత పార్టీ మొదలవడంతో అందరూ పార్టీకి వస్తారు. అప్పుడు నందు లాస్య, సామ్రాట్, తులసి లను చూసి కుళ్ళుకుంటూ ఉంటారు. అనసూయ కూడా వాళ్ళని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
ఆ తర్వాత హనీ కేక్ కట్ చెయ్ అని సామ్రాట్ చెప్పడంతో లేదు నాన్న నేను మా తులసి టీచర్ కోసం ఒక పాటను పడతాను అని చెప్పి తులసి కోసం ఒక పాటను పాడుతూ తులసి తో కలిసి డాన్స్ చేస్తుంది అని అది చూసి అందరూ చెప్పట్లతో ఆనందిస్తూ ఉండగా అనసూయ,నందు దంపతులు మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటారు.
ఆ తర్వాత సామ్రాట్ నందుని పొగుడుతూ నందుని తులసి గారి స్థానంలో ఈ కంపెనీ మేనేజర్ గా నియమిస్తున్నాను అనడంతో తులసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. కానీ నందు లాస్య దంపతులు మాత్రం ఆనందంలో మునిగి తేలుతూ ఉంటారు. అందువల్ల సామ్రాట్ వాళ్ళ బాబాయ్ మాత్రం ఎందుకు వీడు ఇలా చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు తులసి నవ్వుతూ కంగ్రాట్యులేషన్స్ నందగోపాల్ గారు అని చెబుతుంది. ఆ తరువాత ఎవరైతే లేకుండా తన కంపెనీ మంచి కోసం చూస్తారో తనే నిజమైన బాస్. సామ్రాట్ గారు మీరే అసలైన బాస్ మంచి పని చేశారు అని అంటుంది తులసి.
IRCTC Down : ప్రముఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)సైట్, యాప్ గురువారం (డిసెంబర్ 26)…
ICAI CA Final Result 2024 : ICAI CA ఫైనల్ రిజల్ట్స్ నవంబర్ 2024 లైవ్ అప్డేట్స్ :…
Earthquake AP : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భూమి కంపించింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారి…
Earthquake Nepal : మన పొరుగు దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌లో శనివారం ఉదయం 4.8 తీవ్రతతో…
Is Bank Open Today : ఈరోజు బ్యాంకులకు హాలిడే ఉందో లేదో తెలియదా? వారాంతాల్లో ఆర్థిక లావాదేవీలను పూర్తి…
Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్…
This website uses cookies.