...

Venkatesh: వెంకీ మామపై మురళీ మోహన్ ఆసక్తికర కామెంట్లు..!

Venkatesh: దగ్గుబాటి రామానాయుడు గారి చిన్నబ్బాయిగా సినిమాల్లోకి అడుగు పెట్టిన వెంకటేష్.. తన సొంత టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రేక్షకులని నవ్వించాలన్నా, ఏడిపించాలన్నా ఆయన తర్వాతే. ఏ పాత్రలోనైనా సులువుగా పరకాయ ప్రవేశం చేస్తుంటారు ఆయన. టాలీవుడ్ సీనియర్ హీరోల్లో పర్సంటేజ్ ఎక్కువ కల్గిన హీరో అతనే..! వివాదాలకు దూరంగా ఉండే హీరో కూడా అతనే. తన సినిమాలు రిలీజ్ అయిన టైంలో తప్ప.. ఆయన బయట ఎక్కువగా కనపడరు. ఒకవేళ కనిపించారంటే అది క్రికెట్ స్టేడియంలోనే అని చెప్పాలి. నాని ఓ సందర్భంలో చెప్పినట్లు వెంటకేష్ ఆవకాయ లాంటివారు. ఆయని నచ్చని తెలుగు వాడంటూ ఉండడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఈయన గురించి మురళీల మోహన్ పలు ఆసక్తికర కామెంట్లు చేశారు. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

వెంకటేష్ కు మొహమాటం ఎక్కువని, అలాగే చాలా సున్నితమైన వ్యక్తి అని తెలిపారు. మోహన్ బాబు, చిరంజీవి, నాగార్జున లాంటి వాళ్లంతూ మా అధ్యక్ష పదవి చేపట్టినా.. ఒకానొక సమయంలో హీరో వెంకటేష్ మా అధ్యక్ష పదవిని చేపట్టమని అడిగితే ఆయన సున్నితంగా తిరస్కరించారని చెప్పారు. మా అసోసిషేయన్ మొత్తం వెళ్లి బ్రతిమాలినా దాని గురించి నాకు పెద్దగా తెలియదు అని తప్పుకున్నాడని చెప్పారు. కఒసారి ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడు అయిన వెంకటేష్ ఇప్పటికి కూడా అధ్యక్ష పదవిని చేపట్టింది. ఆయన మనస్తత్వం అంత సున్నితమైందని అంటూ చెప్పుకొచ్చారు.