Karthika Deepam Aug 29 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీక దీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో మోనిత,కార్తీక్ అన్న మాటలు తలుచుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో మోనిత, కార్తీక్ గురించి ఆలోచిస్తూ తలనొప్పిగా ఉంది వెంటనే వెళ్లి కాఫీ తాగాలి అనుకొని పక్కనే ఉన్న హోటల్ లోకి వెళుతుంది. ఇక అదే హోటల్లో ఆనందరావు దంపతులు హిమ ఉంటారు. అప్పుడు హిమ,మోనిత ను చూసి సౌందర్య కి చెబుతుంది. ఇంతలోనే మోనిత కూడా వాళ్లను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది.

ఆ తర్వాత తాను టెన్షన్ పడితే వాళ్లకి డౌట్ వస్తుందని చెప్పి కూల్ గా అక్కడికి వెళ్లి వాళ్ళని మాట్లాడిస్తుంది. అప్పుడు హిమ తల నొప్పిస్తోంది అని చెప్పడంతో బయటికి వెళ్లి ఫేస్ వాష్ చేసుకుని రమ్మని చెబుతుంది. అప్పుడు సౌందర్య, ఎలా ఉన్నావు ఇంకో పెళ్లి చేసుకున్నావా అని అడగగా లేదు ఆంటీ నా కార్తీక్ దూరమైనా, తన జ్ఞాపకాలతోనే బతుకుతున్నాను అని అంటుంది. అప్పుడు సౌందర్య ఆపు అంటూ మోనిత పై అరుస్తుంది.
ఆ తర్వాత మోనిత ఇక్కడ ఏం చేస్తున్నారు ఆంటీ అని అడగగా అప్పుడు సౌందర్య తన మనసులో సౌర్య గురించి చెబితే ఇది మళ్ళీ ఏదో ఒకటి చేస్తుంది అని అబద్ధం చెప్పి తప్పించుకుంటుంది. అప్పుడుమోనిత అయితే వీళ్ళకి దీప కార్తీక్ గురించి తెలియదు అనమాట అని లోపల అనుకుని సంతోష పడుతూ ఉంటుంది. ఇంతలోనే కార్తీక్ నుంచి ఫోన్ రావడంతో ఇంపార్టెంట్ కాల్ వచ్చింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మోనిత.
Karthika Deepam Aug 29 Today Episode : సౌందర్య కి ఫోన్ చేయాలి అనుకుంటుంన్న దీప..
మరొకవైపు దీప పదేపదే జరిగిన విషయాలను తలచుకొని మోనిత పై కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి డాక్టర్ వచ్చి దీప తో మాట్లాడడంతో అప్పుడు దీప నాకు ఏదో ఒక పని చూడు అన్నయ్య అని అనడంతో సరే అని అంటాడు. ఆ తర్వాత కార్తీక్ బట్టల షాపులో మోనిత మీద ఉన్న కోపం అక్కడ పనిచేసే వాళ్ళపై చూపిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి మోనిత వస్తుంది.
అప్పుడు కొద్దిసేపు మోనిత కార్తీక్ ఇద్దరు వాదిస్తూ ఉండగా కార్తీక్ మోనిత పై సీరియస్ అవుతాడు. ఇప్పుడు నేను పదేపదే కాల్ చేస్తే నీకు ఎలా అనిపిస్తుందో, నేను బయటికి వెళ్లినప్పుడు కూడా నువ్వు కాల్ చేసి నాకు అలాగే అనిపిస్తుంది అని అంటాడు కార్తీక్. అప్పుడు కార్తీక్ హైదరాబాద్ వెళ్ళాము అనడంతో మోనిత టెన్షన్ తో వద్దు అని కార్తీక్ నచ్చచెబుతుంది.
అప్పుడు మోనిత మాటలు కార్తీకి ఏమి అర్థం కాకపోవడంతో అయోమయంలో ఉంటాడు. మరొకవైపు ఇంద్రమ్మ సౌర్య వాళ్ళు వేరే ఇంట్లోకి మారి సామాన్లు సర్దుతూ ఉంటారు. అప్పుడు ఇందిరమ్మ సౌర్య మీద కోపంతో మాట్లాడడంతో ఏమైంది పిన్ని అని అడగగా ఆ ఇళ్ళు మాకు బాగా కలిసి వచ్చింది అని అంటుంది. అలా కాసేపు వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు.
మరొకవైపు దీప జరిగిన విషయాల గురించి ఆలోచించుకుంటూ అత్తయ్య మామయ్యలకు ఫోన్ చేద్దాము అంటే ఫోన్ నెంబర్ కూడా లేదు అని అనుకుంటూ ఉంటుంది. మేము చనిపోయాము అని వాళ్ళు ఇంకా బాధ పడుతూనే ఉంటారు అని అనుకుంటూ ఉంటుంది దీప.. ఎలా అయినా వీలైనంత త్వరగా డాక్టర్ బాబు ని వెతికి పట్టుకోవాలి అని అనుకుంటుంది దీప.
Read Also : Karthika Deepam Aug 27 Today Episode : మోనిత నిజ స్వరూపం తెలుసుకున్న వంటలక్క.. కోపంతో రగిలిపోతున్న దీప..?