Janaki Kalaganaledu serial September 28 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో లీలావతి కావాలనే జెస్సీని అందరి ముందు అవమానిస్తూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో లీలావతి పూజలు పునస్కారాల గురించి చిన్నప్పటి నుంచి తెలిస్తే వస్తాయి లేకుంటే వాళ్లకి ఏం తెలుస్తాయి అంటూ సూటిపోటి మాటలతో మాట్లాడుతూ ఉండగా వెంటనే జానకి నేర్చుకుంటుంది పిన్ని గారు అందుకే కదా పూజలో కూర్చోబెట్టింది అని అంటుంది.
ఆ తర్వాత పూజారి గారు పాట పాడమని చెప్పగా జానకి పాట పాడుతూ ఉండగా మధ్యలో మల్లిక నువ్వు కూడా పాడు జెస్సి అంటూ జెస్సిని రెచ్చగొడుతుంది. అప్పుడు మల్లికా తో పాటు జెస్సి పాట పాడడంతో అందరూ విచిత్రంగా చూస్తారు. దీంతో ముత్తైదువులు జెస్సిని తలా ఒక మాట అనడంతో జ్ఞానాంబ కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
అయినా ఇలా పూజల గురించి తెలియని పూజలో కూర్చోబెట్టకూడదు ముందే నేర్పించి తీసుకురావాలి అని అంటూ ఉంటారు. ఆ తర్వాత పూజారి గారు హారతి ఇవ్వడంతో అందరూ కల్లకద్దుకుంటారు. అప్పుడు పూజారిగారు ఆ హారతిని వాయినాల పక్కలో పెట్టడంతో లీలావతి, మల్లిక ఇద్దరూ అలాగే చూస్తూ ఉంటారు.
అప్పుడు పూజారి గారు పూజ పూర్తి అయ్యింది ఉండ్రాళ్లు వాయినాలు ఇస్తే పూజ ఫలితం దక్కుతుంది అనడంతో ఇంతలోనే ముత్తైదువులకు ఇవ్వాల్సిన వాయినాలు అంటుకోవడంతో అపచారం అనే ముత్తైదువులు తల ఒక మాట అంటారు. అప్పుడు లీలావతి కొత్త కోడలు వచ్చిన వెంటనేఇలా జరిగింది అంటే ఏమనుకోవాలి.
అంటూ తలా ఒక మాట సూటిపోటి మాటలతో అని అక్కడి నుంచి వాయినాలు తీసుకోకుండా వెళ్లిపోతారు. అప్పుడు జ్ఞానాంబ ఈయన విషయం తెలుసుకుని బాధపడుతూ ఉండగా మల్లికా సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు జానకి అలా అనుకోవద్దండి అత్తయ్య గారు మీరు కూడా ముత్తయిదువే కదా మాతో వయనాలు తీసుకొని మమ్మల్ని దీవించండి మాకు పూజా ఫలితం దక్కుతుంది ప్లీజ్ అత్తయ్య గారు అంటూ బ్రతిమలాడుతుంది జానకి.
అందుకు జ్ఞానాంబ సరే అనడంతో మల్లిక కుళ్ళుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత జెస్సి కూడా ఆశీర్వాదాలు తీసుకోవడంతో అది చూసి మల్లిక కుళ్ళుకుంటూ ఉంటుంది. జ్ఞానాంబ జెస్సిని ఆశీర్వదించినందుకు జానకి సంతోష పడుతూ ఉంటుంది. ఆ తర్వాత రామచంద్ర బైటికి వెళుతూ ఉండగా ఇంతలో కాలేజీ ప్రిన్సిపల్ పిలిచి జానకి గారు సరిగ్గా చదవడం లేదు సరిగ్గా ఎగ్జామ్స్ రాయడం లేదు కాలేజీ కూడా సరిగ్గా రావడం లేదు అని అనడంతో సరే ప్రిన్సిపాల్ గారు నేను చూసుకుంటాను అని అంటారు రామచంద్ర.
ఆ తర్వాత జ్ఞానాంబ జరిగిన విషయాలు తలుచుకుని బాధపడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి జానకి, గోవిందరాజులు వస్తారు. జ్ఞానాంబ బాధపడటం చూసి మల్లికా సంతోష పడుతూ ఉంటుంది.
Rythu Bharosa : తెలంగాణ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా డబ్బులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.…
Jeera Saunf water : మీ ఇంటి వంటగదిలో సులభంగా లభించే అనేక దినుషుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని…
CBSE Admit Card 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025 బోర్డు పరీక్షలకు అడ్మిట్…
NPS Zero Tax : మీరు వేతనజీవులా? ప్రతినెలా జీతం పొందే వ్యక్తి అయితే.. మీకో గుడ్ న్యూస్.. బడ్జెట్…
Vitamin E deficiency : శరీరం సరిగ్గా పనిచేయడానికి అన్ని విటమిన్లు, ఖనిజాలు అవసరం. ఏదైనా విటమిన్ లోపం ఉంటే..…
Lungs Detox : ఊపిరితిత్తులను శుభ్రపరిచే మార్గాలివే : ప్రస్తుత మన జీవనశైలి.. మన ఊపిరితిత్తులపై చాలా చెడు ప్రభావాన్ని…
This website uses cookies.