Janaki Kalaganaledu serial Sep 28 Today Episode : జెస్సిని దీవించిన జ్ఞానాంబ.. కుళ్లుకుంటున్న మల్లిక.?

Janaki Kalaganaledu serial September 28 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో లీలావతి కావాలనే జెస్సీని అందరి ముందు అవమానిస్తూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో లీలావతి పూజలు పునస్కారాల గురించి చిన్నప్పటి నుంచి తెలిస్తే వస్తాయి లేకుంటే వాళ్లకి ఏం తెలుస్తాయి అంటూ సూటిపోటి మాటలతో మాట్లాడుతూ ఉండగా వెంటనే జానకి నేర్చుకుంటుంది పిన్ని గారు అందుకే కదా పూజలో కూర్చోబెట్టింది అని అంటుంది.

Advertisement
Janaki Kalaganaledu serial September 28 Today Episode 
Janaki Kalaganaledu serial September 28 Today Episode 

ఆ తర్వాత పూజారి గారు పాట పాడమని చెప్పగా జానకి పాట పాడుతూ ఉండగా మధ్యలో మల్లిక నువ్వు కూడా పాడు జెస్సి అంటూ జెస్సిని రెచ్చగొడుతుంది. అప్పుడు మల్లికా తో పాటు జెస్సి పాట పాడడంతో అందరూ విచిత్రంగా చూస్తారు. దీంతో ముత్తైదువులు జెస్సిని తలా ఒక మాట అనడంతో జ్ఞానాంబ కోపంతో రగిలిపోతూ ఉంటుంది.

Advertisement

అయినా ఇలా పూజల గురించి తెలియని పూజలో కూర్చోబెట్టకూడదు ముందే నేర్పించి తీసుకురావాలి అని అంటూ ఉంటారు. ఆ తర్వాత పూజారి గారు హారతి ఇవ్వడంతో అందరూ కల్లకద్దుకుంటారు. అప్పుడు పూజారిగారు ఆ హారతిని వాయినాల పక్కలో పెట్టడంతో లీలావతి, మల్లిక ఇద్దరూ అలాగే చూస్తూ ఉంటారు.

Advertisement

అప్పుడు పూజారి గారు పూజ పూర్తి అయ్యింది ఉండ్రాళ్లు వాయినాలు ఇస్తే పూజ ఫలితం దక్కుతుంది అనడంతో ఇంతలోనే ముత్తైదువులకు ఇవ్వాల్సిన వాయినాలు అంటుకోవడంతో అపచారం అనే ముత్తైదువులు తల ఒక మాట అంటారు. అప్పుడు లీలావతి కొత్త కోడలు వచ్చిన వెంటనేఇలా జరిగింది అంటే ఏమనుకోవాలి.

Advertisement

అంటూ తలా ఒక మాట సూటిపోటి మాటలతో అని అక్కడి నుంచి వాయినాలు తీసుకోకుండా వెళ్లిపోతారు. అప్పుడు జ్ఞానాంబ ఈయన విషయం తెలుసుకుని బాధపడుతూ ఉండగా మల్లికా సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు జానకి అలా అనుకోవద్దండి అత్తయ్య గారు మీరు కూడా ముత్తయిదువే కదా మాతో వయనాలు తీసుకొని మమ్మల్ని దీవించండి మాకు పూజా ఫలితం దక్కుతుంది ప్లీజ్ అత్తయ్య గారు అంటూ బ్రతిమలాడుతుంది జానకి.

Advertisement

Janaki Kalaganaledu serial : పూజ చెడగొట్టే ప్లాన్ చేసింది మల్లికే అని జ్ఞానాంబకు తెలుస్తుందా..

అందుకు జ్ఞానాంబ సరే అనడంతో మల్లిక కుళ్ళుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత జెస్సి కూడా ఆశీర్వాదాలు తీసుకోవడంతో అది చూసి మల్లిక కుళ్ళుకుంటూ ఉంటుంది. జ్ఞానాంబ జెస్సిని ఆశీర్వదించినందుకు జానకి సంతోష పడుతూ ఉంటుంది. ఆ తర్వాత రామచంద్ర బైటికి వెళుతూ ఉండగా ఇంతలో కాలేజీ ప్రిన్సిపల్ పిలిచి జానకి గారు సరిగ్గా చదవడం లేదు సరిగ్గా ఎగ్జామ్స్ రాయడం లేదు కాలేజీ కూడా సరిగ్గా రావడం లేదు అని అనడంతో సరే ప్రిన్సిపాల్ గారు నేను చూసుకుంటాను అని అంటారు రామచంద్ర.

Advertisement

ఆ తర్వాత జ్ఞానాంబ జరిగిన విషయాలు తలుచుకుని బాధపడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి జానకి, గోవిందరాజులు వస్తారు. జ్ఞానాంబ బాధపడటం చూసి మల్లికా సంతోష పడుతూ ఉంటుంది.

Advertisement

Read Also : Janaki Kalaganaledu serial Sep 27 Today Episode : పూజ చెడగొట్టడానికి ప్లాన్ వేసిన మల్లిక.. జెస్సిని అవమానించిన ముత్తైదువులు..?

Advertisement
Advertisement