Malli Nindu Jabili Aravind gets angry after spotting Sundar teasing Malli. Afterwards, Vasundhara pressurises Malli to ag ree with her decision.
Malli Nindu Jabili Serial 22 Sep Today Episode : తెలుగు బుల్లి తెరపై ప్రసారమవుతున్న మళ్లీ నిండు జాబిలి సీరియల్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. వసుంధర, మల్లికి పెళ్లి కోసం ఎన్నో సంబంధాలు తెస్తుంది. అరవిందు, మాలిని నేలకొండపల్లి వెళ్లి మల్లి వాళ్ళ అమ్మ తో మాట్లాడాలి అని చెప్తుంది. శరత్ చంద్ర, మీరా తన భార్యని మల్లి తన కూతురు అని ఎక్కడ తెలుస్తుందో అని వసుంధర తో మల్లి తో నేను మాట్లాడతాను చెబుతాడు. మరోవైపు సుందర్ మల్లిని ఆటపట్టించడం చూసిన అరవిందు సుందర్ పై తెచ్చుకుంటాడు. తన పెళ్లి గురించి నీకెందుకు ఇంకొకసారి మల్లి పెళ్లి గురించి ఏడిపిస్తూ కనిపించాలంటే.. సుందర్ సారీ అని అరవింద్ కు చెప్తాడు. నాకు కాదు మల్లి చెప్పు అంటాడు.
మల్లి, అరవిందుతో ఇప్పుడైతే సుందర్ నోరు మూయించారు.. అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో మీరు ప్రమాదంలో పడతారు మీరు అక్కడ వెళ్లకుండా ఉండడానికి ఉపాయం ఆలోచించారా.. అరవిందు అదే ఆలోచిస్తాను మల్లి నేను వద్దంటే వసుంధర వినే పరిస్థితిలో లేదు. ఒకవేళ నేను వెళ్లకపోతే మాలిని పంపిస్తుంది డేంజర్ కదా.. ఏం చేసినా ఎవరికి అనుమానం రాకుండా చేయాలి. నువ్వు నమ్ముకున్న సీతారాముల మనకు దారి చూపిస్తారు నువ్వేం ఏమి టెన్షన్ పడకు మల్లి అని చెప్పి వెళ్తాడు.
మరోవైపు మాలిని, అరవింద దగ్గరికి వచ్చి నేలకొండపల్లి వెళ్దామని చెప్తుంది. అరవిందు, మల్లి పెళ్లి గురించి ఒక్కసారి ఆలోచించు మల్లి అని చెప్తాడు. మల్లిని చూసుకోమని బాధ్యత నీకు ఒక చెప్పారు అందుకే మళ్లీ నువ్వే ఒప్పించాలి అరవింద్ అంటుంది.
నేను చెప్పినా మల్లి వినట్లేదు కదా అంటాడు అరవింద్.. అందుకే కదా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి ఒప్పిదాము.. ఒకవేళ మనం ఇద్దరం వెళ్లడం ఇష్టం లేకపోతే మా అమ్మానాన్న వెళ్తారు అని చెబుతుంది మాలిని.. అరవింద్, వసుంధర వెళ్తే మల్లికి నాకు పెళ్లి అయినట్లు తెలుస్తోంది.. అక్కడ పెద్ద గొడవ జరుగుతుంది మాలిని నేను ఉండే ఆఖరి రోజు అవుతుంది అలా జరగడానికి వీలు లేదు ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటాడు. మాలిని, అరవింద్ ఏమి ఆలోచిస్తున్నావ్.. వసుంధర, శరత్ చంద్ర, అరవింద ఇంటికి వస్తారు.
వసుంధర, అరవింద్ మల్లి వాళ్ళ అమ్మని పెళ్ళికి ఎలాగైనా ఒప్పించు.. తొందరగా వెళ్ళండి అంటుంది. అక్కడికి మల్లి వచ్చి అవసరం లేదు అక్క.. వసుంధరతో మా నాన్న ఎవరో తెలుసాకే పెళ్లి చేసుకుంటాను మా నాన్న చేతుల మీదగా నా పెళ్లి జరగాలని మా అమ్మ కోరిక.. వసుంధర మీ నాన్న ఎక్కడ ఉన్నాడో తెలియదు పైగా మిమ్మల్ని వదిలేసి చాలా సంవత్సరాలు అవుతుంది ఇంకా తిరిగి రాలేదు అలాంటివాడు ఇప్పుడు ఎందుకు తిరిగి వస్తాడు నువ్వు తన కూతురు అని ఒప్పుకుంటాడు అని నాకు నమ్మకం లేదు వసుంధర అంటుంది. శరత్ చంద్ర, వసుంధర నమ్మకం ఉండాల్సింది నీకు కాదు.. మల్లి వాళ్ళ అమ్మ కు అతడు తిరిగి రాడని నువ్వు ఎలా డిసైడ్ చేస్తా.. వసుంధర ఇన్ని సంవత్సరాలు రానివాడు ఇప్పుడెలా తిరిగి వస్తాడు వసుంధర, శరత్ మధ్య మాటలు పెరిగిపోతాయి.
అరవింద్ సారీ అత్తయ్య అని చెప్తాడు. నీల ఆలోచించడం మామయ్య కాదు ఎవ్వరికి రాదు.. ప్రతి ఒక్కరికి కొన్ని కోరికలు ఉంటాయి వాళ్ల జీవితం ఇలా ఉండాలని ఆశ ఉంటుంది. వాటిని మనం గౌరవించాలి.. జరిగేది నేను గౌరవిస్తాను అరవింద్ అని చెబుతుంది వసుంధర.. అలా జరగకపోతే నేను పెళ్లి చేసుకోను అంటుంది మల్లి.. మా నాన్న తను చేసిన తప్పు కి మా అమ్మ ని క్షమాపణ అడగాలి. మల్లి నా బిడ్డ అని అందరికీ గర్వంగా చెప్పాలి. మా నాన్న గారి చేతుల మీద నా కన్యాదానం జరగాలి.. కాబట్టి మాలి అక్కను అరవిందు మా ఊరికి పంపించి మా అమ్మ మనసును బాధ పెట్టకండి.
ఒకవేళ మా అమ్మ బలవంతంగా ఒప్పుకున్న మా అమ్మ కోరిక తీర్చలేదని బాధ నాకు జీవితాంతం ఉంటుంది. పెళ్లి కాకుండా నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే ఈ ఇంటి నుంచి నేను వెళ్ళిపోతాను.. అనుపమ పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే అలా వెళ్ళి పోయింది మల్లి, వసుంధర తప్పుగా అర్థం చేసుకోకండి. మల్లి చెప్పింది కూడా అర్థం చేసుకోవాలి కదా..
ఏ ఆడపిల్ల కైనా తల్లిదండ్రులు చేతిమీద పెళ్లి చేసుకోవాలని ఉంటుంది. అలాగే మల్లి వాళ్ళ అమ్మగారు కూడా కోరుకుంటున్నారు అనుకుంటా.. అరవింద్, మాలిని మీరు నేలకొండపల్లి వెళ్ళద్దు అని చెప్తుంది అనుపం మల్లి బాధపడుతుంది మల్లి పెళ్లి విషయం తన కోరిక ప్రకారమే బాగా చదువుకో తర్వాత వాళ్ల నాన్న ఎవరో తెలిసిన తర్వాత జరుగుతుంది. తన మనసులో వసుంధర, మల్లి నిజమే చెప్పిందా ఆలోచిస్తుంది. నిన్న ఒక మాట ఈరోజు ఒక మాట చెప్తుంది మల్లి అబద్ధం ఆడుతుంది. ఈ విషయం అందరికీ తెలిసేలా చేసి మల్లిని ఇంటి నుంచి బయటకు పంపించాలి..
మల్లిని పిలిచి మీ అమ్మ కి ఫోన్ చేసి మీ నాన్న గురించి అడుగు అనడంతో శరత్ చంద్ర షాక్ అవుతాడు. మరోవైపు అరవింద్ కూడా షాక్ అవుతాడు. మల్లి, మీరా కి ఫోన్ చేసి మా నాన్న గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను చెప్పు అమ్మ అంటుంది. మరోవైపు అరవింద్ మల్లి వాళ్ళ అమ్మ అల్లుడు నా గురించి అడిగితే టెన్షన్ పడతాడు. శరత్ చంద్ర మీరా నా గురించి చెబితే వసుంధర పెద్ద గొడవ చేస్తుంది.. రేపటి ఎపిసోడ్ లో మీరా ,మల్లి కి తండ్రి గురించి ఏం చెబుతుందో చూడాలి మరి..
Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4…
Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర…
Realme 13 Pro Price : రియల్‌మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర…
CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…
Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…
Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…
This website uses cookies.