Politics

PM Kisan : పీఎం కిసాన్ 20వ విడత తేదీ.. లబ్ధిదారుల జాబితాలో మీ పేరు లేకుంటే రూ. 2వేలు పడవు.. ఏం చేయాలంటే?

PM Kisan 20th Installment Date : దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత (PM Kisan) కోసం ఎదురు చూస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో 20వ విడతను విడుదల చేస్తారని భావిస్తున్నారు. అయితే, తేదీ, స్థలం ఇంకా ప్రకటించలేదు. ఈలోగా, రైతులు తమ లబ్ధిదారుల స్టేటస్ చెక్ చేయవచ్చు. పీఎం కిసాన్ యోజనకు అర్హులేనా? కాదా? కేవైసీ స్టేటస్ వంటి వివరాలను తెలుసుకోవచ్చు.

లబ్ధిదారుల జాబితాలో మీ పేరును ఎలా చెక్ చేయాలి? :

1. అధికారిక PM కిసాన్ పోర్టల్‌ (https://pmkisan.gov.in)కు వెళ్లండి.
2. హోమ్‌పేజీలో ‘Farmer Corner’ కింద కొంచెం స్క్రోల్ చేసి ‘PM Kisan Yojana Beneficiary Status’పై క్లిక్ చేయండి.
3. మీ రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామాన్ని ఎంటర్ చేయండి.
4. మీ గ్రామంలోని లబ్ధిదారుల జాబితాను చూసేందుకు ‘Get Report’ పై క్లిక్ చేయండి.

Advertisement

పీఎం కిసాన్ యోజన.. (PM Kisan) జాబితాలో మీ పేరు లేకుంటే ఏం చేయాలి? :
పీఎం కిసాన్ అధికారిక మార్గదర్శకాల ప్రకారం.. లబ్ధిదారుల జాబితాలో పేరు లేని ఏ రైతు అయినా తన ప్రాంతంలోని జిల్లా స్థాయి ఫిర్యాదుల పరిష్కార పర్యవేక్షణ కమిటీని సంప్రదించవచ్చు. పేర్లు లేదా తప్పుగా ఉన్న పేర్లను సవరించేందుకు ఈ కమిటీలు ప్రత్యేకంగా ఏర్పడ్డాయి.

పీఎం కిసాన్ 20వ విడతను విడుదల ఎప్పుడంటే? :

పీఎం మోడీ జూలై 2025లో పీఎం కిసాన్ యోజన 20వ విడతను విడుదల చేయవచ్చు. ఇప్పటికే, పీఎం కిసాన్ 19వ విడత ఫిబ్రవరి 2025లో విడుదల అయింది. ఏదైనా సమస్య ఉంటే.. మీరు PM-కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్‌ (155261, 011-24300606)లకు కాల్ చేయవచ్చు.

Advertisement

Read Also : PF Balance Check : ఇంటర్నెట్ లేకుండా 20 సెకన్లలో మీ PF బ్యాలెన్స్ చెక్ చేయొచ్చు.. సింపుల్ ప్రాసెస్ మీకోసం..!

మీ పీఎం కిసాన్ వాయిదా స్టేటస్ ఎలా చెక్ చేయాలి? :

Advertisement
  • https://pmkisan.gov.in ని సందర్శించండి.
  • ‘Know Your Status’ పై క్లిక్ చేయండి
  • మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి
  • మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో చెక్ చేయండి

పీఎం కిసాన్‌కు ఎవరు అర్హులు? :

  • పీఎం కిసాన్ 20వ విడతకు అర్హతలివే
  • భారత పౌరుడిగా ఉండాలి.
  • సొంత సాగు భూమి
  • చిన్న లేదా సన్నకారు రైతు
  • నెలకు రూ. 10వేలు లేదా అంతకంటే ఎక్కువ పెన్షనర్ కాకూడదు.
  • పన్నుచెల్లింపుదారులు
  • సంస్థాగత భూస్వామిగా ఉండకూడదు.

ఎలా అప్లయ్ చేసుకోవాలి? :

  • పీఎం కిసాన్ అధికారిక (https://pmkisan.gov.in) పోర్టల్‌‌కు వెళ్లండి
  • ‘New Farmer Registration’ పై క్లిక్ చేయండి.
  • మీ ఆధార్ నంబర్, క్యాప్చాను ఎంటర్ చేయండి
  • వివరాలను నింపండి, ‘Yes’పై క్లిక్ చేయండి.
  • ఫారమ్‌ను పూర్తి చేసి submit చేయండి. ప్రింటవుట్ తీసుకోండి.

e-KYC ఎలా పూర్తి చేయాలి? :

పీఎం కిసాన్ 20వ వాయిదా త్వరలో వచ్చే అవకాశం ఉంది. రూ. 2వేలు డబ్బులు పడాలంటే అర్హత కలిగిన రైతులు అంతకు ముందే e-KYC పూర్తి చేయాలి. పీఎం కిసాన్ లబ్ధిదారులందరికీ e-KYC (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) తప్పనిసరి.

Advertisement

మీ పేరు లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తారు. ఈ పథకం అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. PMKISAN రిజిస్టర్డ్ రైతులకు eKYC తప్పనిసరి. మీరు e-KYC మూడు సులభమైన మార్గాల్లో పూర్తి చేయవచ్చు. OTP- ఆధారిత e-KYC, బయోమెట్రిక్ e-KYC, ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయొచ్చు.

Advertisement
Tufan9 Telugu News

Tufan9 Telugu News providing All Categories of Content from all over world

Recent Posts

Business Idea : మీ జాబ్‌కు గుడ్‌బై చెప్పేయండి.. ఈ 5 బిజినెస్‌లతో కోట్లు సంపాదించుకోవచ్చు.. తక్కువ పెట్టుబడితో కోట్ల ఆదాయం..!

Business Idea : ఆన్‌లైన్ కంటెంట్ క్రియేషన్ నుంచి అగరుబత్తుల తయారీ వరకు ఈ వ్యాపారాలు తక్కువ డబ్బుతో ప్రారంభమై…

10 hours ago

Muharram School Holiday 2025 : ముహర్రం ప్రభుత్వ సెలవుదినం ఎప్పుడు? జూలై 7న స్కూళ్లు, కాలేజీలకు హాలిడే ఉంటుందా?

Muharram School Holiday 2025 : జూలై 7, 2025, మొహర్రం సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం (is tomorrow…

2 days ago

PF Balance Check : ఇంటర్నెట్ లేకుండా 20 సెకన్లలో మీ PF బ్యాలెన్స్ చెక్ చేయొచ్చు.. సింపుల్ ప్రాసెస్ మీకోసం..!

PF Balance Check : ఇప్పుడు మీరు ఇంటర్నెట్ లేకుండా కూడా PF బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. మీరు SMS,…

3 days ago

Shortest Day : భూమి వేగం పెరిగింది.. ఇకపై రోజుకు 24 గంటలు ఉండదు.. రోజు ఎందుకు తగ్గుతోందంటే?

Shortest Day : భూమి భ్రమణ వేగం పెరిగింది. రోజు 24 గంటలు కాదు.. చంద్రుడు, భూమి ఒక భాగంలో…

3 days ago

Thammudu Movie Review : తమ్ముడు మూవీ రివ్యూ.. అక్క ఆశయం కోసం తమ్ముడి పోరాటం.. నితిన్ ఖాతాలో హిట్ పడినట్టేనా?

Thammudu Movie Review : ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అయిన తమ్ముడు మూవీ మరి ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ఇప్పుడు…

5 days ago

This website uses cookies.