Nuvvu Nenu Prema Padmavathi and Vikramaditya perform the ritual. Later, Shanthadevi expresses her gratitude to Padmavathi for convincing Vikramaditya.
Nuvvu Nenu Prema serial 22 Sep Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కృష్ణాష్టమి వేడుకలు భాగంగా ఉట్టి కొట్టేటప్పుడు మాయ కింద పడిపోతుంది. విక్రమాదిత్య పోటీగా పద్మావతి వస్తుంది. విక్రమాదిత్య, పద్మావతి చిలిపి గొడవతో ఉట్టి కొడతారు. పూలదండ ఇద్దరు మెడలో పడుతుంది. శాంతాదేవి చాలా సంతోషపడుతుంది. శాంతా దేవి అనురాధను అండాలను ఆర్య నువ్వు వెళ్లి పంపించిరా పద్మావతితో చిన్న పని ఉంది అని చెప్తుంది. పద్మావతిని ఇంట్లోకి తీసుకొని వెళుతుంది. అరవింద,విక్కీ ఇంట్లోకి వెళ్ళగానే కుచల, ఆర్యను నువ్వు వెళ్ళద్దు అని చెప్తుంది.. కుచల, ఆండాలు మధ్య గొడవ జరుగుతుంది.
ఆర్య, కుచల మాట వినకుండా అనురాధను తీసుకొని వెళ్తాడు. ఆండాలు, ఆర్యను చాలా మంచి వాడివి అని పోగొడుతుంది. విక్రమాదిత్యకి చాలా కోపం ఉంది మీ ఇద్దరు అన్నదమ్ములు అంటే నమ్మలేకపోతున్నాను అని చెప్తుంది. శాంతాదేవి, పద్మావతిని తీసుకొని విక్కీ వాళ్ళ అమ్మ ఫోటో దగ్గరికి వెళ్లి ఈ సంతోషానికి కారణం పద్మావతి, విక్కీ ఉట్టి కొట్టేలా చేసింది. విక్కీ, పద్మావతి లేకపోతే ఎప్పటిలాగే కృష్ణాష్టమి జరిగేదని బాధ పడే వాళ్ళం.. నువ్వు లేని లోటు తీర్చలేనిది ఈ పద్మావతి మన ఇంటికి వచ్చింది లలిత.. మర్చిపోలేను ఈ రోజు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను.
పద్మావతి ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలి శాంతాదేవి అంటుంది. పద్మావతి అంత పెద్ద మాటలు ఎందుకు బామ్మగారు మీ మనవడి కోసం తన తమ్ముడి కోసం అరవింద పడే బాధను నేను చూడలేకపోయినా అందుకే మీ మనవళ్ళు కాస్తయినా మార్పు తెచ్చి పోగొట్టాలని ఇలా చేశాను. పద్మావతికి శాంతాదేవి, విక్రమాదిత్య గురించి చెబుతుంది. విక్కీ అమ్మ దూరం అయినప్పటి నుంచి సంతోషం దూరమైపోయింది . వాళ్ల అమ్మతో కలిసి సంతోషంగా దూరమైపోయింది. వాళ్ళ అమ్మ తో పాటే సరదాలు, సంతోషాలు అన్ని వెళ్ళిపోయాయి.
గతం చేసిన గాయాన్ని మర్చిపోలేక వాళ్ళమ్మతో పంచుకున్న జ్ఞాపకాలను తలచుకుంటూ ఇలా ముందు ఒంటరిగా ఉంటున్నాడు అందరికీ బాధను ఇస్తున్నాడు. పద్మావతి అనవసరంగా అడగకూడదు అడిగినట్టు ఉంది బావగారు.. మీరు ఊరుకోండి నన్ను క్షమించండి. శాంతాదేవి నువ్వు దగ్గర ఉంటే ఉన్నట్లు అనిపిస్తుంది. నువ్వు ఇంటికి మాయని మార్చడానికి వచ్చిన నీవల్లే విక్కీ మళ్లీ మామూలే మనిషి అవుతాడు అని నమ్మకం కలుగుతుంది శాంతాదేవి తన మనసులో విక్కీ జీవితంలోకి పద్మావతి వస్తే చాలా సంతోషంగా ఉంటాడు అనుకుంటుంది.
ఈ ఆనందాన్ని సంతోషాన్ని ఎప్పటికీ దూరం చెయ్యకు పద్మావతి అని అంటుంది శాంతాదేవి. అది చూసిన కుచల, మాయతో విక్కీ భార్యగా కావడం ఖాయం.. అరవిందతో పాటు వికీని కూడా పద్మావతి తనకు అనుకూలంగా మార్చుకుంటుందని మాయతో అంటుంది. వెంటనే మాయ కోపంతో నేను ఉండగా ఎప్పటికి అలా జరగదు అని అంటుంది. రేపటి ఎపిసోడ్ లో పద్మావతి, విక్రమాదిత్య మధ్య గొడవ జరుగుతుంది.. ఎందుకో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే మరి.
Read Also : Intinti Gruhalakshmi: సామ్రాట్ ఇంట్లో తులసి కుటుంబం..తులసిని వెళ్లిపోమంటూ వార్నింగ్ ఇచ్చిన నందు..?
Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4…
Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర…
Realme 13 Pro Price : రియల్‌మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర…
CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…
Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…
Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…
This website uses cookies.