Viral Video: చిన్న పిల్లలు ఏం చేసినా చాలా ముద్దుగా అనిపిస్తుంది. బుడి బుడి అడుగులు వేసే దగ్గర నుండి వారి నోటి నుండి వచ్చే అచ్చీ రాని మాటలు చాలా నవ్వు తెప్పిస్తాయి. వారి అల్లరి పనులు భలే సరదాగా ఉంటాయి. సోషల్ మీడియా వచ్చాక ఈ వీడియోలు చాలానే కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో బుడ్డోడి వీడియో ఒకటి చూస్తే చాలు.. ఇక అలాంటివే అన్నీ కనిపిస్తుంటాయి. అందులో ఆ పిల్లలు చేసే అల్లరి భలే నవ్వు తెప్పిస్తుంది. వారి అచ్చీ రానీ మాటలు బాగుంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటిదే.
ఒక బుడ్డోడు తన తండ్రికి కిచెన్ నుండి దోశ తీసుకువచ్చి వడ్డిస్తున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. చిన్న పిల్లాడు దోశ వడ్డిస్తేనే అంతగా వైరల్ కావడానికి ఏముంది అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే.
AdvertisementView this post on Instagram
AdvertisementAdvertisement
జోషిక్ అనే ఇన్ స్టాగ్రామ్ యూజర్ తన అకౌంట్ లో ఈ వీడియో పోస్టు చేయగా.. చాలా తక్కువ సమయంలోనే ఈ వీడియోకు విపరీతమైన లైకులు, కామెంట్లు, షేర్లు వచ్చాయి. అంతలా ఆ బుడ్డోడు ఏం చేశాడంటే.. ఆ పిల్లాడు.. దోశను తన తండ్రి ప్లేట్ లో వేస్తూ గరిటెతో తన తండ్రి ప్లేట్ లో దోశను తిప్పిన విధానం భలే ఉంది. ఈ వీడియోను ఇప్పటి వరకు 16 మిలియన్ల మంది వీక్షించారు. దీనిని చూసిన నెటిజన్లు ఆ పిల్లాడి టాలెంట్ కు ఫిదా అవుతున్నారు.