Intinti Gruhalakshmi: అభికి తగిన విధంగా బుద్ధి చెప్పిన తులసి..ప్రేమ్ మీద రివేంజ్ తీర్చుకున్న శృతి..?

Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తులసి నందు దంపతులకు తగిన విధంగా బుద్ధి చెబుతుంది.

ఈరోజు ఎపిసోడ్ లో నందు లాస్య ఇద్దరూ మాట్లాడుకుంటూ సామ్రాట్ గారేమో తులసిని తీసుకు రమ్మని చెబుతున్నారు తులసి నేను రాను పొమ్మని చెబుతోంది వీరిద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నాను అని అంటాడు నందు. అప్పుడు లాస్య ఇందుకోసం నా దగ్గర ఒక ప్లాను ఉంది అని చెప్పగా వెంటనే ఆ ప్లాన్ అమలు చేసి ఇద్దరు దొరికిపోతాము అని అంటాడు. మరొకవైపు అభి జరిగిన విషయాన్ని తలుచుకొని బాధపడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి తులసి అంకితలు రావడంతో అప్పుడు అభి అమ్మ నేను నీతో కొంచెం సేపు మాట్లాడాలి అని అంటాడు.

Advertisement

అప్పుడు వెంటనే అంకిత ఆంటీ ని ప్రశ్నించే హక్కు నీకు లేదు అని అనడంతో వెంటనే అభి నువ్వు నాన్నతో అలా మాట్లాడటం నాకు నచ్చలేదు అమ్మ అని అంటాడు. వెంటనే తులసి నువ్వు నా మీద బురద చల్లావు అవి అయినా సరే నేను ఆయనతో ఈ మధ్య కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నాను..అయితే ఇప్పుడు ఏంటి అన్న విధంగా తులసి మాట్లాడుతుంది. అప్పుడు అంకిత అభి కూడా అలాగే తయారవుతున్నాడు ఆంటీ అని అంటుంది.

వెంటనే తులసి ఇప్పటినుంచి నాకు నచ్చినట్టు నేను చేస్తాను ఎవరి మాట వినను అయినా సరే అక్కడికి వెళ్లడం వల్ల లాభం నష్టం అనేది నాకు కదా మరి నువ్వు ఎందుకు అలా విలవిలాడుతున్నావు అని అవి అని ప్రశ్నిస్తుంది తులసి. ఆ తర్వాత ప్రేమ్ బయటికి బయలుదేరగా ఇంతలో తులసి వచ్చి ఎక్కడికి అని అడగడంతో ఈవెంట్ మేనేజర్ దగ్గరికి అని అనగా ముందే చెప్పిన టిఫిన్ చేసే దాన్ని కదా అనడంతో శృతి ఏమీ తెలియనట్టుగా యాక్టింగ్ చేస్తుంది.

అప్పుడు తులసి ప్రేమ్ ని తిని వెళ్ళమని చెప్పి అరుస్తుంది. అప్పుడు శృతి బయటకు వెళ్లి ముగ్గు వేస్తుంది. అప్పుడు శృతి, ప్రేమ్ బండి పంచలు చేసి రేవంజ్ తీర్చుకుంటుంది. ఇప్పుడు శృతి ఏమీ తెలియనట్టుగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. దాంతో ప్రేమ్ శృతిని బాగా మనసులో తిట్టుకుంటూ ఉంటాడు.

Advertisement

ఆ తర్వాత నందు, లాస్య వాళ్లు సామ్రాట్ దగ్గరికి వెళ్ళి తులసి కంపెనీకి రాను అని చెప్పేసి ఉంది సార్ మేము ఎంత బ్రతిమలాడినా రాలేదు మమ్మల్ని అవమానించింది అని తులసి మీద లేనిపోనివన్నీ చెబుతూ ఉంటారు. ఆ తర్వాత ఏం పర్లేదు మీరు ఇక్కడే ఉండండి అని అనడంతో నందు లాస్యలు సంతోషపడుతూ ఉంటారు.

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel