Janaki kalaganaledu july 6 today episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జానకి, మందుల కోసం వెళ్లి ఎంతసేపటికి రాకపోవడంతో మల్లికా తనపై చాడీలు చెబుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో డాక్టర్ వచ్చి గోవిందరాజులు పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది అనడంతో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. వేరే హాస్పిటల్ కి తీసుకెళ్లిన ప్రమాదం ఎక్కువ అవుతుందని తనకు తెలిసిన హాస్పిటల్ లో వైద్య సదుపాయాలు ఉన్నాయా లేవా అడిగి చెబుతాను అని చెప్పి ఫోన్ చేస్తాడు అప్పుడు జానకి మామయ్య గారు అంటూ ఎమోషనల్ అవుతూ వస్తుంది. అప్పుడు త్వరగా ఎమర్జెన్సీ ఇంజక్షన్ ను ఇస్తుంది.

డాక్టర్ ఆ ఇంజక్షన్ ఇవ్వడంతో గోవిందరాజులు నిద్రలోకి చేరుకుంటాడు. అప్పుడు డాక్టర్ జానకి ఇచ్చిన మందులు చూసి పాత మందులు ప్రస్తుతం అబ్జర్వ్ చేద్దాము అని అంటాడు. అప్పుడు మల్లి కథ నోటికి వచ్చిన విధంగా వాగుతూ ఉండడంతో విష్ణు మల్లిక నోరు మూయి స్తాడు. ఇక అందరూ బయటికి వచ్చి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో మల్లికా ఎలా అయినా జానకిని బుక్ చేయాలి అని అనుకుని మల్లికా టాబ్లెట్స్ తీసుకుని రావడం ఆలస్యం అయింది కాబట్టి మామయ్య గారికి ఇలా జరిగింది అంటూ జానకి పై లేనిపోని చాడీలు చెబుతుంది.
ఆ తరువాత జానకి గురించి లేనిపోని మాటలు చెప్పి జ్ఞానాంబ జానకిని ప్రశ్నించే విధంగా చేస్తుంది మల్లిక. ఇక మల్లికా అనుకున్న విధంగానే జ్ఞానాంబ, జానకిని మెడిసిన్స్ తేవడానికి ఇంత సమయం ఎందుకు పట్టింది అని అడుగుతుంది. ఇక మధ్యలో మల్లిక,జ్ఞానాంబ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ రెండు మూడు గంటలు సినిమాకు వెళ్ళిందేమో అని అంటూ ఉండగా వెంటనే జానకి కోపంతో మల్లిక నోరు మూయిస్తుంది.
janaki kalaganaledu july 6 today episode : జానకికి కృతజ్ఞతలు చెప్పిన రామచంద్ర,జ్ఞానాంబ..
అప్పుడు జానకి మాట్లాడుతూ జ్ఞానాంబ కు జరిగిన విషయాన్ని చెబుతుంది. మామయ్య బీబీ టాబ్లెట్లు అని చెప్పాడని కానీ అక్కడికి వెళ్లిన తర్వాత నడుము నొప్పి అని తెలిసింది అని చెబుతుంది జానకి. ఆ తర్వాత ఎమర్జెన్సీ ఇంజక్షన్ గురించి తెలియడంతో ఆలస్యమైన సరే ఆ ఇంజక్షన్ తేవాలి అని చాలా దూరం వెళ్లాను అని చెబుతుంది. అప్పుడు జ్ఞానాంబ సరే అని అంటుంది. మరోవైపు గోవిందరాజులు డాక్టర్ తో తనకు ఇప్పుడు బాగానే ఉంది అనడంతో ఇంట్లో వాళ్లకి బాగానే ఉంది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు జ్ఞానాంబ జానకిని దగ్గర తీసుకుని కృతజ్ఞతలు తెలుపుతుంది. ఆ తర్వాత జానకి దంపతులు గదిలో మాట్లాడుకుంటూ ఉండగా రామా జానకి తన తండ్రిని కాపాడాడు అని కృతజ్ఞతలు తెలుపుతాడు.
అప్పుడు జానకి తనకు కృతజ్ఞతలు చెప్పవద్దని అది తన బాధ్యత అని అంటుంది. కానీ నేను మీతో సమయాన్ని గడపలేక పోతున్నాను అని బాధపడుతుంది. అప్పుడు రామచంద్ర మీరు కేవలం ఐపీఎస్ చదువు కోసం మాత్రమే నన్ను దూరం పెడుతున్నారే తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు కదా జానకి గారు అనడంతో వారి మాటలు విన్న జ్ఞానాంబ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Janaki Kalaganaledu: జానకి గురించి ఆలోచిస్తూ బాధపడుతున్న రామచంద్ర.. టెన్షన్ పడుతున్న జ్ఞానాంబ..?