Janaki Kalaganaledu Oct 4 Today Episode : జెస్సీ ని అసహ్యించుకుంటున్న అఖిల్.. సరికొత్త ప్లాన్ వేసిన మల్లిక..?

Jessie tries to support Akhil as he gets upset by Jnanamba's in todays janaki kalaganaledu serial episode
Jessie tries to support Akhil as he gets upset by Jnanamba's in todays janaki kalaganaledu serial episode

Janaki Kalaganaledu Oct 4 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో రామచంద్ర, జానకి సంతోషంతో ఇంటికి వస్తారు. ఈరోజు ఎపిసోడ్ లో రామచంద్ర తన తల్లిని అందర్నీ పిలిచి అమ్మ జానకి గారు ఎగ్జామ్ బాగా రాశారు అని చెప్పడంతో జ్ఞానాంబ సంతోషపడుతుంది. అంతే కాదమ్మా ఎన్ని మార్కులకు పెడితే అన్ని మార్కులు వచ్చాయి అనటంతో అందరూ సంతోషపడుతూ ఉండగా మల్లిక మాత్రం కుళ్ళుకుంటూ ఉంటుంది. అప్పుడు రామచంద్ర ఆనందం ను చూసి జ్ఞానాంబ కూడా సంతోష పడుతూ ఉంటుంది.

Jessie tries to support Akhil as he gets upset by Jnanamba's in todays janaki kalaganaledu serial episode
Jessie tries to support Akhil as he gets upset by Jnanamba’s in todays janaki kalaganaledu serial episode

అప్పుడు మల్లిక లోపల కుళ్లుకుంటూ బయటికి మాత్రం నవ్వుతూ ఉంటుంది. అప్పుడు జ్ఞానాంబ జానకిని పొగుడుతూ దగ్గరికి తీసుకుని నుదుటిపై ముద్దుని పెట్టడంతో అది చూసి మల్లిక మరీంత కుళ్ళుకుంటూ ఉంటుంది. అప్పుడు జానకి వాళ్ళనే పొగుడుతూ జెస్సి, అఖిల్ వాళ్లను ఉద్దేశిస్తు కొన్ని మాటలు అంటుంది జ్ఞానాంబ.

Advertisement

దాంతో అఖిల్ కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయి నన్ను ఇంట్లో ఒకప్పుడు ఎంత బాగా చూసుకునేవారు ఇప్పుడు ఇన్ని మాటలు అంటున్నారు అంటే అదంతా ఆ జెస్సీ వల్లే అని జెస్సీ పై కోపంతో రగిలిపోతూ ఉంటాడు అఖిల్. ఇంతలోనే జెస్సీ అక్కడికి రావడంతో అఖిల్ ఏం మాట్లాడకుండా ఉంటాడు.

అప్పుడు జెస్సి జ్ఞానాంబ గురించి గొప్ప గొప్పగుడుతూ అత్తయ్య గురించి నాకంటే నీకే బాగా తెలుసు త్వరలోనే అత్తయ్య మనసు మారుతుంది లే అని అనడంతో అఖిల్ కోప్పడుతూ ఇదంతా నీ వల్లే జరిగింది జెస్సి అప్పుడే చెప్పాను అబార్షన్ చేయించుకోమని నువ్వు వినకుండా వదిన సహాయం తీసుకొని నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నావు ఇదంతా నీ వల్లే అని కోపంగా మాట్లాడి ఎక్కడి నుంచి వెళ్లిపోతాడు అఖిల్.

Advertisement

జానకి కలగనలేదు సీరియల్ అక్టోబర్ 4 ఈరోజు ఎపిసోడ్ : సరికొత్త ప్లాన్ వేసిన మల్లిక..

దాంతో జెస్సి బాధపడుతూ ఉంటుంది. తర్వాత జానకి పడుకుని ఉండగా రామచంద్ర ఏదో పని చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు రామచంద్ర అక్కడికి వెళ్లి ఏం చేస్తున్నారు రామచంద్ర గారు అని అడగగా మీ పరీక్షలు అయ్యేవరకు నేను ఏం చేయాలో మిమ్మల్ని ఎలా చదివించాలో అని రాసుకుంటున్నాను అనడంతో జానకి నవ్వుతూ నేను ఇప్పుడు బాగానే చదువుతున్నాను కదా అంటుంది.

మీరు స్వీట్ షాప్ గురించి చూసుకోండి అనటంతో ఏం కాదు అమ్మ నిన్ను చూసుకోమని చెప్పింది అని అంటాడు రామచంద్ర. అప్పుడు సరే రామ గారు రేపటి నుంచి మొదలు పెడదాము అని అనడంతో రామచంద్ర జానకిని ఎత్తుకొని గదిలోకి తీసుకొని వెళ్తాడు. మరుసటి రోజు ఉదయం జ్ఞానాంబ పని చేసుకుంటూ ఉండగా ఎంతలోనే గోవిందరాజులు అక్కడికి వస్తాడు.

Advertisement

అప్పుడు ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా బొమ్మల కొలువు పెడదాం అని అనడంతో మొన్న జరిగింది చాలు అండి ముత్తైదువుల దగ్గర మాట పడాల్సి వచ్చింది అది మళ్ళీ జరగడం నాకు ఇష్టం లేదు అని అంటుంది జ్ఞానాంబ. ఈ సంవత్సరం మనం బొమ్మల కొలువు చేయాలి ఎందుకంటే మన కుటుంబంలో ఇప్పుడు ఇద్దరు కడుపుతో ఉన్నారు వాళ్ల కోసమైనా చేయాలి అని అనడంతో అని అంటుంది జ్ఞానాంబ. ఆ మాటలు విన్న మల్లిక ఎలా అయినా ఆ పూజని చెడగొట్టాలి అని అనుకుంటూ ఉంటుంది.

Read Also : Devatha serial Oct 4 Today Episode : రాధ మీద కోపంతో రగిలిపోతున్న సత్య.. ప్రకృతి వైద్యశాలకు వెళ్లిన రామ్మూర్తి కుటుంబం..?  

Advertisement