Jabardasth Riyaz : పండగలు వచ్చాయంటే ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్స్ లో సందడి మొదలవుతుంది. ఆర్టిస్టులతో షోలు కళకళలాడిపోతాయి. తెలంగాణలో బోనాత జాతర మొదలైన సందర్భంగా బోనాల సెలబ్రేషన్స్ ను షురూ చేసింది. జీ తెలుగు యాజమాన్యం జీ తెలుగు వారి జాతర పేరుతో సంది చేయనుంది.
సీరియల్ ఆర్టిస్టులు, కమెడియన్స్, సింగర్స్ చేసిన హడావుడిని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను జూలై 23న రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ వడియోకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా కమెడియన్ రియాజ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.
ఈ ప్రోమోలో కమెడియన్ రియాజ్ భార్య కొత్త పెళ్లి కూతురిలా ముస్తాబౌ స్టేజీపైకి వచ్చారు. రియాజ్ తన భార్య పేరును రివీల్ చేశారు. తన భార్య పేరు యాస్మిన్ అని రియాజ్ అనగా… కాదు.. యాస్మిన్ రియాజ్ అని సద్దామ్ అనడంతో రియాజ్ సిగ్గుపడుతారు. సద్దామ్, రిాజ్ ఇద్దరిలో ఎవరు బాగా పెర్ఫార్మ్ చేస్తారని యాంకర్ శ్రీముఖి అడగ్గా… మరో మాట లేకుండా రియాజ్ అనే యాస్మిన్ అన్నారు. ఆ తర్వాత ఈ జంట దండలు మార్చుకున్నారు.
ఈ మొత్తం ఎపిసోడ్ లో రియాజ్, యాస్మిన్ ల జంట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
Read Also : Deepthi Sunaina : దీప్తి సునైన టాటూలో ఇంత సీక్రెట్ ఉందా? జాకెట్ బటన్స్ విప్పేసి మరి చూపించిందిగా..!