Soundarya : సాధారణంగా ఈ ప్రపంచంలో మనుషులు పోలిన మనుషులు 7 మంది ఉంటారని మనం వింటూ ఉంటాం. ఈ క్రమంలోనే ఒకటి రెండు చోట్ల మనుషులను పోలిన మనుషులని మనం చూస్తూ ఉంటాము. ఇలా ఒకే వ్యక్తి పోలికలతో ఒకరిద్దరు ఉండటం మనకు తారసపడే ఉంటారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో అగ్రతారగా కొనసాగుతూ సినిమా ఇండస్ట్రీని ఏలిన నటి సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె మరణించి కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ ఈమె పట్ల ఉన్న అభిమానం ఇప్పటికీ ప్రేక్షకులలో తగ్గలేదు.

have-you-seen-this-girl-like-totally-looks-like-soundarya
ఇలా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న సౌందర్యను హెలికాప్టర్ ప్రమాదంలో మృత్యు వెంటాడి తనని తీసుకెళ్ళి పోయింది. ఇలా సౌందర్య చనిపోయిన, ఇప్పటికీ ఈమెకు ఎంతోమంది అభిమానులు ఉన్నారంటే ఈమె ఏ స్థాయిలో ప్రేక్షకులను సందడి చేస్తుందో అర్థమవుతుంది. ఇకపోతే ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు సంపాదించుకొని ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నటి సౌందర్య పోలికలతో ఉన్నటువంటి ఒక అమ్మాయి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ అమ్మాయి ఫోటో చూసిన నెటిజన్లు సౌందర్య మళ్లీ తిరిగి వచ్చిందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
అచ్చం సౌందర్య పోలికలతో ఉన్నటువంటి ఈ యువతి పేరు చిత్రజి. ఈవిడ మలేసియాలో ఉంటుంది. అందరిలాగే ఈమె కూడా సోషల్ మీడియా వేదికగా తన వీడియోలు ఫొటోలను షేర్ చేయడంతో ఎంతో మంది ఈమె వీడియోలు చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. మీరు అచ్చం సౌందర్య పోలికలతో ఉన్నారంటూ కామెంట్ చేయడంతో అప్పటినుంచి ఈమె సౌందర్య సినిమాలోని సన్నివేశాలకి లిప్ సింక్ చేస్తూ నెటిజన్లను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈమెకు రోజురోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడమే కాకుండా ఈమె ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ జూనియర్ సౌందర్య పై ఓ లుక్ వేయండి.
AdvertisementView this post on Instagram
Advertisement
Read Also : Vijay devarakonda : లైగర్ జోడి క్రేజీ స్టెప్స్.. ఆనందంలో రౌడీ బాయ్ ఫ్యాన్స్!