Marriage Stopped: మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణపురంకు చెందిన బొద్దుల రాజేష్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. గతంలో పెళ్లి అయి విడాకులు తీసుకున్న రమినా అనే యువతితో ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నాడు. ప్రియురాలు రమినా కూడా గతంలొ రామకృష్ణపురంలోనే ఉండేది. ప్రస్తుతం ఆమె హుజూరాబాద్ లో ఉంటోంది. అయితే రమినాకు తెలియకుండా రాజేష్ పెళ్లి నిశ్చయం చేసుకున్నాడు. ఈక్రమంలోనే వివాహ తంతు జరుగుతోంది.
ప్రియుడి బంధువల వాట్సాప్ చూసి విషయం తెలుసుకున్న రమీనా పోలీసులతో సహా పెళ్లి మండపానికి చేరుకుంది. వివాహం జరుగుతుండగా మధ్యలో వచ్చి.. అచ్చం తెలుగు సినిమాల్లోలాగా పెళ్లి ఆపండి అని అరిచింది. దీంతో బంధువులంతా షాక్ కు గురయ్యారు. పెళ్లి పీటల మీదు కూర్చుకున్న రాజేషన్, తాను గత ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నామని వివరించింది. తనను శారీరకంగాను వాడుకున్నాడని, గతేడాది అబార్షన్ కూడా చేయించాడని యువతి ఆరోపించింది.
తనతో రాత్రి వరకు వాట్సాప్ లో చాట్ చేశాడని.. అసలు ఈ పెళ్ళి విషయం తనకేమి తెలియదని చెప్పింది. ఇదంతా విన్న పెళ్లి కూతురు తరఫు బంధువులంతా పెళ్లి కుమారుడు, వారి కుటుంబంపై దుమ్మెత్తి పోశారు. ఇలాంటి వాడికా తమ కూతురును ఇచ్చి పెళ్లి చేయాలనుకుంది అని కన్నీటి పర్యంతం అయ్యారు. ఆమెతోపాటే పెళ్లి మండపంలోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు పెళ్లి కుమారుడు రాజేష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై పూర్తి వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.